చెత్త సేకరణలో ప్లాన్ చేసుకోవాలి

Published: Friday April 23, 2021
ఎస్బిమ్ రాష్ట్ర డైరెక్టర్...సురేష్ బాబు..
పరిగి, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, ప్రతి ఇంటినుంచి తడి పొడి చెత్త సేకరణకు అన్ని స్థాయిల సిబ్బందితో ప్రణాళిక తయారు చేసుకోవాలని రాష్ట్ర స్వచ్ఛభారత మిషన్ డైరెక్టర్ సురేష్ బాబు సర్పంచ్ కె రాజిరెడ్డి కి సూచించారు. గురువారం అయన దోమ గ్రామపంచాయతీ లోని కంపోస్ట్ షెడ్ డంపింగ్ యార్డ్ ను పరిశీలించి దోమ గ్రామపంచాయతీ పైలెట్ ప్రాజెక్ట్ గా ఏర్పాటు అయినందున గ్రామంలో సేకరిస్తున్న తడి పొడి చెత్త విధానం ఎంత మేర సక్సెస్ అవుతుందని సర్పంచ్ ను అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంతం కావడం నిరక్షరాష్యత అవగాహన లోపం తో ఇంకా 200 ఇళ్ల నుంచి తడి పొడి చెత్త వేరు చేయడం లేదని సర్పంచ్ రాజిరెడ్డి తెలుపగ అందుకు ఆయన ఏ ఇంటి నుంచి చెత్త వేరు చేసి ఇవ్వడం లేదో గుర్తించినందున ప్రతి 25 ఇళ్లకు ఒక ఉద్యోగిని సూపర్ వైజరు గా నియమించుకోవాలని డైరెక్టర్ సూచించారు. ప్రతి ఇంటినుంచి చెత్త వేరు చేసి ఇచ్చే వరకు పంచాయతీ సిబ్బందికి అంగనవాడి. మహిళా సంఘాల సిబ్బంది. వ్యవసాయ శాఖ ఏ ఈవోలు సహకరించాలని అన్నారు. కొన్ని శాఖల సిబ్బందిని ప్రతి రోజు వారికీ కేటాయించిన ఇళ్లకు తిరిగి అవగాహన కల్పిస్తారని చెప్పారు.