ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 25ప్రజాపాలన ప్రతినిధి *ఘనంగా సీయోను గాస్పల్ చర్చిలో క్రిస్మస్ వే

Published: Monday December 26, 2022
ప్రేమ, సహనం, క్షమాపణ ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని ఇబ్రహీంపట్నం మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి క్రిస్టియన్ మీడియా కన్వీనర్ చేెరుకూరి రాజు, సీయోను గాస్పల్ చర్చ్ వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి క్రిస్మస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఆదివారం  క్రిస్మస్ పర్వదినం సందర్భంగాపాస్టర్ ఇమ్మానియేల్ పీటర్ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీస్తు జన్మదినమును క్రిస్మస్ పండుగగా జరుపుకుంటున్న నేపథ్యంలో మానవుల పాపాలను కడిగి మానవులను నరకం నుండి తప్పించేందుకు, మానవ రూపంలో భూమి మీదకు వచ్చిన పరిశుద్ధుడు యేసు అని మనుషుల పాపాలను తన రక్తంతో కడిగాడు అన్నారు. ప్రేమ, సహనం, క్షమాపణ లను క్రీస్తు జీవితం మనకు నేర్పిందన్నారు.ఆయన బోధనలు ఆచరణీయం అని  ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుపుకునే క్రీస్తు జన్మదిన వేడుకను క్రైస్తవులు అందరూ కుటుంబ సభ్యులతో ఆనందంగా జరుపుకోవాలని కోరారు. ఏసుక్రీస్తు దయతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరారు.
అదేవిధంగా నియోజకవర్గ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి కొంత అనారోగ్యంగా ఉన్నారని ప్రతి చర్చిలో ఆయన త్వరగా కోలుకొని ప్రజల్లోకి రావాలని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చెరుకూరి రాజు ఆధ్వర్యంలో జరిపించారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలోపాస్టర్ ఇమ్మానియేల్ పీటర్, డాక్టర్ రాంబాబు భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు,