108 సేవలు అందుబాటులో లేక ప్రజల అవస్థలు

Published: Saturday July 03, 2021
మధిర, జులై 02, ప్రజాపాలన ప్రతినిధి : వారం రోజులు కావస్తున్నా వినియోగంలోకి రాని వైనంపేద ప్రజల ప్రాణాలను గాలి కో దిలేస్తున్న అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు 108, నామ అంబులెన్స్ సేవలను తక్షణమే అందుబాటులోకి తేవాలిసిపిఐపట్టణ కార్యదర్శి బెజవాడ రవి బాబు డిమాండ్ నియోజకవర్గ కేంద్రమైన మధిరలో గత వారం రోజులుగా గా 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో లేక ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ బాబు అన్నారు. ఈనెల 20వ తేదీన 108 అంబులెన్స్కు యాక్సిడెంట్ జరుగగా సంబంధిత అధికారులు ఇంతవరకు వాహనాన్ని ని రిపేరు చేయించి అందుబాటులోకి తీసుకు రాకపోవడంతో రోడ్డుప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను తరలించేందుకు అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అదేవిధంగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మధిర కు కేటాయించిన అంబులెన్స్ ఆలనా పాలనా పట్టించుకోకపోవడంతో చెట్ల కింద నిరుపయోగంగా ఉందన్నారు. దీంతో నామ  అంబులెన్స్ సేవలు కూడా స్థానిక ప్రజలు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అని, దీనికి  సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యం వైఫల్యాలే కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి తక్షణమే 108, నామ అంబులెన్స్ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని బెజవాడ రవి డిమాండ్ చేశారు.