లాక్ డౌన్ కట్టుదిట్టం చేసిన పోలీసులు.

Published: Saturday May 15, 2021

జిల్లా కేంద్రంలో  పోలీసు బందోబస్తు ఏర్పాట్లను సమిక్షించిన డిసిపి.
రాపనపల్లి-సిరొంచ అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ ను సందర్శించిన జైపూర్ ఏసీపీ నరేందర్.

మంచిర్యాల, మే14, ప్రజాపాలన ప్రతినిధి : కరోనా కట్టడి చర్యలలో బాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన లాక్ డౌన్ శుక్రవారం రెండవ రోజు కొనసాగింది. లాక్ డౌన్ ఉల్లంఘన లు జరగకుండా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిదిలోని మంచిర్యల జిల్లా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. జిల్లా కేంద్రంలో డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంచిర్యల పోలీసులు రహాదారులు, వాటి ప్రదానకుడలీల వద్ద పర్యవేక్షణ చేశారు. నిషేదాగ్నలు ఉల్లంఘించి వారిపై చర్యలు చేపట్టారు. డిసిపి ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా కేంద్రంలో ని పోలీస్ బందోబస్తు ఏర్పాటు సమిక్షించారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ కరోనా విస్తృతంగా వ్యాపిస్తున్న తరుణంలో లాక్ డౌన్ లో ఎవ్వరు కూడా అనవసరంగా బయటకు రావద్దు హెచ్చరించారు. లాక్ డౌన్ మినహాయింపు ఉన్నవారు తప్పనిసరిగా వారి ఐడి కార్డులు వెంట తీసుకువచ్చి పోలీసులకు సహకరించాలని కోరారు. ప్రజలు ఎవరైనా లాక్ డౌన్ లో బయటకు కారణం లేకుండా తిరిగినట్లయితే వారిపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా కోటపల్లి మండలంలోని రాపనపల్లి-సిరొంచ అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ ను జైపూర్ ఏసీపీ నరేందర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఏసీపీ చెక్ పోస్ట్ వద్ద ఉన్న అధికారులకు, సిబ్బందికి విధుల నిర్వహణకు సంబందించిన సూచనలు చేశారు.పాస్ లు ఉన్న వాహనాలను మాత్రమే అనుమతి చేయాలని, మెడికల్ ఎమర్జెన్సీ, గూడ్స్ వాహనాలు అనుమతి ఉందని అన్నారు. ప్రజలందరూ లాక్ డౌన్ ని విజయవంతం చేసి కరోనా మహమ్మారిని తరిమికొట్టాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎసిపి వెంట చెన్నూరు రూరల్ సీఐ నాగరాజు, కోటపల్లి ఎస్సై రవి కుమార్, పిఎస్ఐ శ్రీకర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.