టిపిటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షులు - బోగ రమేష్

Published: Saturday September 17, 2022

మల్లాపూర్, సెప్టెంబర్ 16 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) జిల్లా శాఖ అధ్యక్షులు బోగ రమేష్ ఆధ్వర్యంలో మల్లాపూర్ మండలం చిట్టాపూర్, రాఘవపేట, మొగిలిపేట, ఓబుళాపూర్, మల్లాపూర్, గొర్రెపెళ్లి, వివి రావుపేట పాఠశాలలను సందర్శించి సమస్యలను సేకరించడంతో పాటు, సమస్యల పరిష్కారానికి టీపీటీఎఫ్ తో ఉద్యమాల్లో కలిసి రావాలని ఉపాధ్యాయులను కోరారు. జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోగ రమేష్ మాట్లాడుతూ, 30 నుండి 35 సం. సుదీర్ఘకాలంగా ఉద్యోగం చేస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షన్ పొందడమనేది హక్కు అని, అలాంటి హక్కు కాలరాయడం సరియైనది కాదని, సీపీఎస్ రద్దు నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నందున సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానం పునరుద్ధరించాలని, ఉపాధ్యాయ-విద్యారంగం పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరి విడనాడి, విద్యారంగ అభివృద్ధికి కృషి చేయాలని, పాఠశాలల్లో చేపడుతున్న మన ఊరు-మనబడి కార్యక్రమంను పటిష్టంగా అమలు జరగాలంటే ప్రాథమిక పాఠశాలల్లో కనీసం 5గురు ఉపాధ్యాయులను నియమించాలని,

బదిలీలు-పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేసి దసరా సెలవుల్లోగా పూర్తిచేయాలని,

పాఠశాలలు పరిశుభ్రంగా ఉండాలంటే పారిశుద్ధ్య కార్మికులను ప్రత్యేకంగా నియమించాలని,

పాఠశాల ఖాతాల్లో ఉన్న డబ్బులు కొత్త ఖాతాల పేరుతో వెనుకకు తీసుకున్న ప్రభుత్వం- ఇప్పటికి పాఠశాలలకు ఒక్కపైసా కూడా గ్రాంట్ విడుదల చేయలేదని, వెంటనే పాఠశాలల గ్రాంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈకార్యక్రమంలో

మల్లాపూర్ మండల బాధ్యులు తిరుకోవెల నారాయణ, కొక్కుల బాలకృష్ణ, బందరికంటి శ్రీనివాస్, పాక కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.