వాసవి క్లబ్ ఆధ్వర్యం లో కార్తీకమాస అన్నదానం

Published: Friday November 04, 2022

మంచిర్యాల టౌన్, నవంబర్ 03, ప్రజాపాలన: మంచిర్యాల వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కార్తీక మాసం సందర్భంగా ఐబి చౌరస్తాలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా  నెలరోజులు నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో భాగంగా గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్తీక మాసం పురస్కరించుకొని వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నెలరోజులపాటు మానసిక వికలాంగుల పురావాస కేంద్రంలోని మానసిక వికలాంగులకు కూడా అన్నదానాన్ని చేపట్టారు. ఈ అన్నదాన కార్యక్రమంలో అన్నదాత చిలువేరు సురేష్, ప్రోగ్రాం చైర్మన్ పడకంటి శ్రీనివాస్, వాసవి క్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ , కార్యదర్శి నలమాస్ ప్రవీణ్ క్యాబినెట్ కోశాధికారి పుల్లూరి బాల్మోహన్, రీజియన్ చైర్మన్ వుత్తూరి రమేష్ , వాసవి క్లబ్ నాయకులు యెర్రం వెంకటేశ్ , కేశెట్టి నారాయణ, తోట రాజయ్య, చందూరి ప్రభాకర్, గంప కుమారస్వామి, రమేష్, దొడ్డ ముత్తయ్య తోపాటు వాసవి క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.