ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో సిపిఐ పార్టీ మండల ల నూతనంగా కార్యదర్శులను ఎన్నుకోవడమైనది* *రంగ

Published: Monday August 01, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 31 ప్రజాపాలన ప్రతినిధి.

ఇబ్రహీంపట్నం భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నియోజకవర్గ మండలాల వారిగా నూతన కమిటీలు ఏర్పాటు చేయడమైనది ఈ సందర్భంలో రంగారెడ్డి జిల్లా సిపిఐ ప్రధాన కార్యదర్శి పాలమాకుల జంగయ్య మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో సిపిఐ పార్టీని మరింత బలపరిచే విధంగా ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేసే విధంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పార్టీని మరింత ప్రతిష్ట చేసే విధంగా ప్రజలను  పోరాటాల వైపు మళ్లించే  చూడాలని కార్యకర్తలకు సూచించారు. పేద ప్రజలు నిత్యం కష్టాలను ఎదుర్కొంటున్న సందర్భంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలకు  రేషన్ కార్డుల కోసం వృద్ధాప్య పింఛన్ వ్యవసాయ కార్మిక సంఘం సమస్యలు అనేకమైన సమస్యలు తీసుకొని ప్రజలకు అనుగుణంగా సిపిఐ పార్టీ పనిచేస్తుందని ఆయన తెలిపారు.  తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను పీడిస్తుందని నిరుద్యోగులకు  ఉద్యోగాలు కల్పించలేని పరిస్థితి మరో పక్క దళితులకు మూడు ఎకరాల భూమి  ఇస్తానని మాట పలికిన కేసీఆర్ దొంగల వివరిస్తున్నారని అదే కాకుండా ఫీల్డ్ అసిస్టెంట్లను ఉద్యోగాలు కల్పిస్తారని అసెంబ్లీలో తెలిపారు. ఇంతవరకు ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి మరో పక్క వీఆర్ఏలు నిరవధిక సమ్మెలు చేస్తా ఉంటే వారికి ఇచ్చే స్కేలు అందివలేని పరిస్థితి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానిది దళిత బంధు రైతుబంధు అని ప్రజలను మభ్యపెడుతూ ప్రజలను మోసం చేసి ఓట్లు దండుకునే విధంగా చూస్తున్నారని  ఆయన దుయ్యబట్టారు.  కాంగ్రెస్ పార్టీ నాడు బలహీన వర్గాలకు 60 గజాలు ఇస్తారని ఒకపక్క వాళ్ళు చెపితే అది కాదు టిఆర్ఎస్ ప్రభుత్వం  అధికారంలోకి రాగానే డబల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని కోతల కోశారు. కెసిఆర్ ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల మయంలో కూర్కపోయే విధంగా చేస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. ప్రజలు నిత్యం వాడుకునే గ్యాస్ ధరలు బిజెపి ప్రభుత్వం రేట్లు పెంచి ప్రజలకు బెంబేలెత్తిస్తున్నదని కాంగ్రెస్ టిఆర్ఎస్ బిజెపి పా వులు కదుపుతున్నాయని ఇక వీళ్ళు ఆటలు సాగవు అంటూ వీరికి రోజులు దగ్గర పడ్డాయని ప్రజలు గమనిస్తున్నారు. ఇక తిరగబడి రోజులు వస్తున్నాయని  రేపు రాబోయే రోజుల్లో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో వామపక్ష పార్టీలను ఏకం చేసి విధంగా చూడాలని  ఇబ్రహీంపట్నం సీటు కైవసం చేసుకునే విధంగా చూడాలని కార్యకర్తలకు చూపించారు. ఆగస్టు 2 తారీఖున షాద్ నగర్ జిల్లా మహాసభలు జరుగుతాయని రాష్ట్ర నాయకులు తెలియజేశారు అదే కాకుండా రాష్ట్ర మహాసభలు సెప్టెంబర్ 4  ,7 తేదీలలో శంషాబాద్ లో దాదాపుగా 30 వేల మందితో జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ సందర్భంలో ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో మండలాల వారీగా నూతనంగా సిపిఐ పార్టీ  కమిటీలు ఆధ్వర్యంలో  వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి కార్యవర్గ సభ్యులు కావలి నరసింహ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు శీవరాల లక్ష్మయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ఓరుగంటి యాదయ్య, గీత కార్మిక సంఘం జిల్లా నాయకులు రాములు గౌడ్, జిల్లా నాయకులు హళ్లిముద్దీన్, మహిళా సంఘం జిల్లా నాయకురాలు పోచమోని నీలమ్మ,  ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి గా పూల యాదయ్య, మంచాల మండల కార్యదర్శి బాల్రాజ్, యాచారం మండల కార్యదర్శి మస్కు సంజీవ, మండల సహకార దర్శి విజయ్ కుమార్,. మండల కార్యవర్గ సభ్యులు బండ నరసింహా కార్యకర్తలు పాల్గొన్నారు.