పొంగి ప్రవహిస్తున్న వైరా నది ముసురేసిందిమధిరలో ఎడతెరపి లేకుండా వర్షం

Published: Monday July 11, 2022
పొంగి ప్రవహిస్తున్న వైరా నదిజాలిముడి కాలువకు గండి*

మధిర జులై 10 ప్రజా పాలన ప్రతినిధి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మధిర డివిజన్లో రెండు రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు మధిర సబ్ డివిజన్‌లోని చెరువులు, వాగులు, వంకలు నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలకు జాలిముడి ఎడమ కాలువకు సిరిపురంలో ఒకచోట వంగవీడు గ్రామంలో మరోచోట గండి  పడింది. ఎడతెరప లేకుండా  కురిసిన వర్షాలకు జనజీవినం స్తంభించపోయింది. భారీ వర్షాలకు ప్రజలెవరూ బయటకు రాకుండా గృహాల కే పరిమితమయ్యారు. భారి వర్షాలకు వైరా నది పొంగి ప్రవహిస్తుంది. అదేవిధంగా ముదిగొండ మండలం పెద్దమండవ చింతకాని మండలం చిన్న మండవ వద్ద మున్నేరు బోనకల్ మండలంలో కలకోట వద్ద వైరా నది, ఎర్రుపాలెం మండలంలో కట్టలేరు నదులకు భారీగా వరద నీరు రావటంతో నదులు పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తుండగా పలుచెరువులు పలుగులు పడ్డాయి. వైరా నదికి భారీగా వరద నీరు రావడంతో జాలిముడి ప్రాజెక్టు  పొంగి ప్రవహిస్తుంది. భారీ వర్షానికి మధిర మండలం మాటూరు వాగుపై నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రోడ్డు కొట్టుకు పోయింది. దీంతో మధిర నుండి మాటూరు మాటూరు పేట నాగవరపాడు మర్లపాడు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. మధిర పట్టణంలో డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉండటంతో రెండో వార్డు, లడకబజార్ మెయిన్ రోడ్ పైకి వర్షపు నీరు  రావటంతో రహదారులన్నీ చెరువులుగా మారిపోయాయి. రెండో వార్డులో గృహాల్లోకి సైతం వర్షపు నీరు చేరింది. మున్సిపాలిటీలోని పలు వీధుల్లో ఎక్కడ చూసినా వర్షపు నీరు రహదారుల పైకి చేరటంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. దీంతో వాహన దారులు, ప్రజలు బయటికి రావడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. మధిర చెరువుతో పాటు పలు చెరువులకు భారీగా వర్షపు నీరు చేరడంతో అలుగులు పడ్డాయి. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెప్పడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దారు రాంబాబు సిఐ మురళి పేర్కొన్నారు.