బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిన సర్పంచులు

Published: Monday October 04, 2021
బోనకల్, ప్రజాపాలన ప్రతినిధి, అక్టోబర్ 3 : మండలంలోని అన్ని గ్రామ పంచాయితీలలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఆ గ్రామాల సర్పంచులు ప్రారంభించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం రాష్ట్రంలోని ఆడపడుచుల దసరా పండుగ నాడు కొత్త చీరలు కట్టుకొని వారి ముఖంలో చిరునవ్వు కనపడాలనే ఉద్దేశంతో ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా తూటికుంట్ల, ఆళ్ల పాడు, బోనకల్, రావినూతల, గోవిందపురం(ఎ), ముష్టికుంట్ల గ్రామాలలో ఆయా గ్రామాల సర్పంచులు, నోముల వెంకట నరసమ్మ, మర్రి తిరుపతిరావు, కొమ్మినేని ఉపేందర్,భూక్యా సైదా నాయక్, భాగం శ్రీనివాసరావు, షేక్ జాన్బి లు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచులు మాట్లాడుతూ గ్రామ ప్రజలకు మొదటి వ్యాక్సిన్ వేయించుకొని వారికి తప్పక వ్యాక్సిన్ వేయించుకోవాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు మరియు ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, ఆర్ఐఓ లక్ష్మణ్ నాయక్, టిఆర్ఎస్ మండల అధ్యక్షులు చేబ్రోలు మల్లికార్జునరావు, టిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు బంధం శ్రీను, బోనకల్ గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు గుండపనేని సుధాకర్ రావు, బోనకల్లు ఉప సర్పంచ్ యార్లగడ్డ రాఘవ, మోర్ల నరసింహారావు, జిల్లా మత్స్య శాఖ అధ్యక్షులు బొమ్మకంటి సైదులు, టిఆర్ఎస్ నాయకులు పొందూరు కృష్ణయ్య, భాగం నాగేశ్వరరావు, సొసైటీ వైస్ చైర్మన్ శంకర్రావు, మరియు మండలంలోని గ్రామాలు ఇతర ప్రజాప్రతినిధులు టిఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.