జనసేన పార్టీ నాయకులు శంకర్ గౌడ్ జన్మదిన వేడుకలు

Published: Tuesday December 28, 2021
బోనకల్ డిసెంబర్ 27 ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్ జన్మదిన వేడుకలు మధిర నియోజవర్గం జనసేన పార్టీ నాయకులు తాళ్లూరి డేవిడ్ ఆధ్వర్యంలో బోనకల్ ఓల్డ్ ఏజ్ హోమ్ లో కేక్ కట్ చేసుకుని ఘనంగా జరుపుకున్నారు. అదేవిధంగా శంకర్ గౌడ్ జన్మదినం సందర్భంగా వృద్ధులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అనంతరం నాయకులు మాట్లాడుతూ శంకర్ గౌడ్ మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని వారు అన్నారు. పండ్లు పంపిణీ చేసిన వారికి ఓల్డ్ ఏజ్ హోమ్ వారు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మధిర నియోజవర్గ విద్యార్థి విభాగ నెంబర్స్ గంధ ఆనంద్ వినయ్, ఎస్ కె జానీ బాబా, ఎస్ కే బాజీ, అశోక్  తదితరులు పాల్గొన్నారు.