విద్యుత్ సబ్ డివిజన్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మధిర

Published: Friday June 03, 2022

జూన్ 2 రూరల్ ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడుతెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు మదిర  విద్యుత్ శాఖ సబ్ డివిజన్ పరిధిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదిర సబ్ డివిజన్ కార్యాలయం, ఈ ఆర్ వో, సబ్ డివిజన్ పరిధిలోని పరిధిలోని అన్ని సెక్షన్ ఆఫీసులో జాతీయ జెండా ఎగురవేసి, తెలంగాణ కోసం ఆత్మార్పణ చేసుకున్న అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. మధిర సబ్ డివిజన్ ఆఫీస్ నందు CH. సి.హెచ్. సుధాకర్ రావు ఈ ఆర్ ఓ కార్యాలయం లో  సి.హెచ్. ప్రభాకర్ రావు , మధిర టౌన్ ,రూరల్ సెక్షన్ ఆఫీస్ లో AE K నాగేశ్వరావు , ఎర్రుపాలెం సెక్షన్ కార్యాలయంలో వేణు గోపాల్  జాతీయ జెండా ఎగరవేసిన వేసినారు. ఈ కార్యక్రమాలలో అన్ని స్థాయిలలోని విద్యుత్ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.