సెంటర్ పేరు లేకుండా పరీక్షల హాల్ టికెట్లు.. అవస్థలో విధ్యార్థులు

Published: Monday September 20, 2021
హైదరాబాద్, 19 సెప్టెంబర్, ప్రజాపాలన ప్రతినిధి: పరీక్ష సెంటర్ పేరు లేకుండా హాల్ టికెట్లు. తమ పరీక్షలు రాయడం ఎక్కడో! అనే అయోమయంలో అంబేద్కర్ విశ్వవిద్యాలయం పీజీ విద్యార్థులు. 2018-19 విద్యా సంవత్సరం నుండి మొదటి సారిగా పిజి స్థాయిలో కొన్ని కోర్సులు సెమిస్టర్ విధానం ద్వారా పిజి కోర్సుల విద్యార్థులకు ప్రవేశం కల్పించారు. అంటే రెండు సంవత్సరాల కోర్సు సెమిస్టర్ విధానంలో ఈ క్రింది విధంగా ఉంటుందన్నారు. మొదటి సంవత్సరం: సెమిస్టర్-1, సెమిస్టర్-2 మరియు రెండవ సంవత్సరం: సెమిస్టర్-3, సెమిస్టర్-4 అనే విధంగా ఉంటుందన్నారు. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం పరీక్షల టైమ్ టేబుల్ విడుదల చేశారు. తేదీ 22 సెప్టెంబర్ నుండి 26 సెప్టెంబర్ వరకు పీజీ రెండవ సెమిస్టర్ పరీక్షలు మరియు 28 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 3 వరకు మొదటి సంవత్సరం పిజి పరీక్షలు జరుగుతాయని విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం నుంచి ప్రకటన విడుదల చేయడం జరిగిందన్నారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్ మొదటి సెమిస్టర్ మరియు రెండవ సెమిస్టర్ పరీక్షల సెంటర్ పేరుతో హాల్ టికెట్లు ముద్రించి ఉండాలి. ఇందుకు భిన్నంగా మొదటి సంవత్సరం పరీక్షలు రాసే వారికి జూబ్లీ హిల్స్ లోని 228 సోషల్ సైన్సెస్ స్టడీ సెంటర్ ను పరీక్షల సెంటర్ గా మరియు రెండవ సంవత్సరం పరీక్షలు రాసే వారికి సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని 139 స్టడీ సెంటర్ అయిన సర్దార్ పటేల్ కళాశాల పరీక్ష సెంటర్ గా హాల్ టికెట్ల లో పేర్కొన్నారు. విద్యార్థులు తమ. పీజీ హాల్ టికెట్ మొదటి సెమిస్టర్ పరీక్ష సెంటర్ మరియు రెండవ సెమిస్టర్ పరీక్ష సెంటర్ అని ముద్రించాలి. ఇందుకు భిన్నంగా మొదటి సంవత్సరం పరీక్ష సెంటర్ మరియు రెండవ సంవత్సరం పరీక్ష సెంటర్ అని ముద్రించడం తో విద్యార్థులు తాము మొదటి సెమిస్టర్ మరియు రెండవ సెమిస్టర్ అయితే ఇలా ముద్రించారు అని ఆందోళనకు గురవుతున్నారు. విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం పరీక్షలు జరిగే సెంటర్ విషయంలో కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో తగు సవరణలు వెంటనే చేసి విశ్వవిద్యాలయం వెబ్ సైట్ లో విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.