రామంతాపూర్లో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు

Published: Monday February 20, 2023
మేడిపల్లి, ఫిబ్రవరి 19 (ప్రజాపాలన ప్రతినిధి)
చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను రామంతాపూర్లో శివాజీ యూత్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు తిండేరు హనుమంతరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా  ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్, స్థానిక కార్పొరేటర్లు కక్కిరేని చేతన హరీష్, బండారు శ్రీవాణి వెంకట్రావు పాల్గొని టీవీ స్టూడియో మెయిన్ రోడ్డులో నెలకొన్న చత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కక్కిరేణి హరీష్ ,సంజయ్ పటేల్, సుమన్ రావు, ఎల్లా చారి, నాగేష్ గుప్తా, సోమ శ్రీనివాసులు, రమేష్ గుప్తా, అరవింద్, రాపోలు సాయినాథ్, ముత్తినేని జగదీష్, సంకూరి కుమారస్వామి‌ తదితరులు పాల్గొన్నారు.