మునుగోడు ఎన్నికలలో గౌడ సామాజిక వర్గానికి అన్ని పార్టీల అన్యాయం : గోపా రాష్ట్ర అధ్యక్షుడు మద్

Published: Monday October 10, 2022
మునుగోడు లో గౌడ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉన్నా ఏ ఒక్క పార్టీ కూడా గౌడ సామాజిక వర్గం వారికి పోటీ చేసే అవకాశం కల్పించక పోవడం అన్యాయం అన్నారు గౌడ్ ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మద్దెల రమేష్ గౌడ్.సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ గౌడ సామాజిక వర్గానికి ఇప్పటివరకు చేసిన ఏ వాగ్దానాలు కూడా నెరవేర్చలేదని, హుజురాబాద్, దుబ్బాక లలో కూడా ఇలాగే గౌడ వర్గాలకు అన్యాయం చేశారన్నారు. నియోజకవర్గం లో అత్యధిక ఓట్లు ఉన్న తమ గౌడ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని గతం నుండి కోరుతూనే ఉన్నామని, తాము ఏ పార్టీ కి వ్యతిరేకం కాదని, గౌడ బిడ్డలకు అన్యాయం చేయడం తగదని అన్ని పార్టీ లకు విజ్ఞప్తి చేశారు.మునుగోడు ఉప ఎన్నికలలో టి.ఆర్.యస్ పార్టీ కుసుకుంట్ల ప్రభాకర్
రెడ్డికి టికెట్ ఇచ్చిన నేపధ్యంలో మిగతా గౌడ సంఘాల ఆధ్వర్యంలో గోపా కూడా మద్దతు
ప్రకటించింది అని వచ్చిన వార్తను ఖండిస్తున్నామన్నారు, గోపా మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్ ప్రకటన
కంటే ముందే “బి.సి” సామాజిక వర్గం మరియు అత్యధిక ఓట్లు గౌడ సామాజిక వర్గానికి చెందిన
ఓటర్లు ఎక్కువగా ఉన్నందున గౌడ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వవలసినదిగా రాష్ట్రంలోని అన్ని
రాజకీయ పార్టీలకు గోపా విజ్ఞప్తి చేస్తూ ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు ఫ్యాక్స్ ద్వారా వాట్సాప్ 
ద్వారా తమ విజ్ఞప్తులను పంపామన్నారు.
కాని ఏ పార్టీకి కూడా గౌడ సామాజిక వర్గానికి అత్యధికంగా ఓటర్లున్న మునుగోడు ఉప
ఎన్నికలో టికెట్ ఇవ్వక “గౌడ” సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వక పోవటం విచారకరం దీనిని
మేము ఖండిస్తున్నాము.ఈ కార్యక్రమం లో వి. రామారావు గౌడ్,మొగిలి గౌడ్, మీరయ్య గౌడ్,సైదులు గౌడ్, సత్యం గౌడ్,చంద్రశేఖర్ గౌడ్, భాను చందర్ తదితరులు పాల్గొన్నారు.