వ్యక్తిగత హక్కును కాలరాస్తున్న ప్రభుత్వాలు

Published: Friday January 06, 2023
* జిల్లా బిఎస్పి అధ్యక్షుడు గొర్లకాడి క్రాంతికుమార్
వికారాబాద్ బ్యూరో 05 జనవరి ప్రజాపాలన : వ్యక్తిగత హక్కును కాలరాస్తున్న ప్రభుత్వాల తీరుపై నిరసన తెలపాలని జిల్లా బిఎస్పి అధ్యక్షుడు గొర్లకాడి క్రాంతికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ రాష్ట్ర బిఎస్పి అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  ఫోన్ ట్యాపింగ్ చేయడాన్ని నిరసిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలపామని అన్నారు. భారత రాజ్యాంగం కల్పించిన వ్యక్తిగత గోప్యత హక్కుకు విరుద్దంగా ప్రభుత్వ వ్యవహారించడం సమంజసం కాదన్నారు. సుప్రీంకోర్టు జడ్జితో ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్యాప్ చేయకపోతే ఎవరు హ్యాక్ చేస్తున్నారో ప్రభుత్వమే నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. లిక్కర్ స్కాం గురించి మాట్లాడినందుకు ఫోన్ ట్యాప్  చేస్తున్నారా అని ప్రశ్నించారు. బిసిల వాటా తేల్చమన్నందుకేనా ఫోన్ ట్యాప్ చేస్తున్నదని దెప్పి పొడిచారు. బిసి, ఎస్సి, ఎస్టి, మైనారిటీల రిజర్వేషన్లు పెంచమన్నందుకా ఫోన్ ట్యాప్ చేస్తున్నది. పేదల గొంతుకై మాట్లాడుతున్నందుకా ఫోన్ ట్యాప్ చేస్తున్నది. బహుజనులకు కాంట్రాక్టులు కావాలని అడిగినందుకా ఫోన్ ట్యాప్ చేస్తున్నది. నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్నందుకా ఫోన్ ట్యాప్ చేస్తున్నది.
కౌలు రైతులు, పేద రైతుల కష్టాలు చూస్తున్నందుకా ఫోన్ ట్యాప్ చేస్తున్నారని ఘాటుగా స్పందించారు.