గురువు అక్షరాలతో కాక అనుభవాలతో పాఠాలు నేర్పుతారు : కార్పొరేటర్ నాగేందర్ యాదవ్

Published: Thursday July 14, 2022

ప్రజా పాలన,- శేరిలింగంపల్లి, /జూలై 13 

 
 : గురువు అక్షరాలతో కాక అనుభవాలతో పాటాలు నేర్పుతారని కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. బుధవారం శ్రీ సాయి బృందావన క్షేత్రం నేతాజీనగర్, గుల్ మోహర్ పార్క్ లో శ్రీ శ్రీ పరమాంస పరివ్రాజకాచార్య శ్రీ మాధవానంద సరస్వతి స్వామి వారి ఆశీస్సులతో శ్రీ విఘ్నేశ్వర సహిత దత్తాత్రేయ స్వామి, బాబా వారికి అభిషేక కార్యక్రమంలో కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పాల్గొని ఎంఐజి కార్పొరేటర్ సింధు ఆదర్శ రెడ్డితో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హుడా ట్రేడ్ సెంటర్ సాయిబాబా మందిరంలోను, రాజీవ్ గృకల్పలో గల సాయిబాబా మందిరంలోనూ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భారీ ఎత్తున పాల్గొన్న భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డించినారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఒక పవిత్రమైన రోజుగా గురువుని స్మరించుకుని గురు పూర్ణిమి రోజు పూజలు చేస్తే తమకు సకల సంపదలు లభిస్తాయని అన్నారు. మనము ఏ రంగంలో విజయం సాధించాలన్న, ఉన్నత స్థాయికి ఎదగాలంటే గురుశిక్షణ తప్పనిసరి అని తెలిపారు. మన నైపుణ్యాలను మరింత మెరుగుపరిచి మనలోని వివేక జ్యోతిని వెలిగించి ప్రగతి పథంలో నడిపించేవారు గురువేనని తెలిపారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తొలి గురువు తల్లి. ఆ తర్వాత మనకు వివేక జ్యోతిని వెలిగించి, మనకు ఏది మంచి, ఏది చెడు అనే విషయాలను చెప్పేవారే గురువులు అని అన్నారు. ఆధ్యాత్మిక చింతన ద్వారా గురు బలాన్ని పొందవచ్చునని అన్నారు. అలాంటి గురువులను పూజించడం కోసం నిర్ణయించిన తిథి గురుపూర్ణిమ అని, ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సింధు ఆదర్శరెడ్డి, రాష్ట్ర యువజన నాయకులు రాగం అనిరుద్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, మహేష్ గౌడ్, బుచ్చిరెడ్డి, రాజీవ్ గృహకల్ప వార్డు మెంబర్ శ్రీకళ, భక్తులు తదితరులు పాల్గొన్నారు.