ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల ఆలస్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమే

Published: Thursday March 30, 2023
మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్
మేడిపల్లి, మార్చి 29 (ప్రజాపాలన ప్రతినిధి)
ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనుల ఆలస్యానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం మరియు జిహెచ్ఎంసి సహాయ నిరాకరణ వల్ల ఇప్పటికీ  అనేక పనులు పెండింగ్లో ఉన్నాయని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ,బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు  ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. బుధవారం ప్రభాకర్ ఆధ్వర్యంలో బిజెపి కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ నిరసన ర్యాలీని చేపట్టారు.  ఈ సందర్బంగా  ప్రభాకర్ మాట్లాడుతూ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రధానమంత్రినే  మంత్రి కేటీఆర్ నిందిస్తున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు  కేంద్ర ప్రభుత్వాన్ని, మంత్రి నితిన్ గడ్కరిని ఒప్పించి ఎలివేటెడ్ కారిడార్ కు స్వీకారం చుట్టామన్నారు.    ఈ సందర్భంగా కార్పొరేటర్లు  మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ ప్రభాకర్ కృషితో ఏర్పడిన ఎలివేటెడ్ కారిడార్ పనులు పుర్తియితే ప్రభాకర్  పేరు ఉప్పల్ చరిత్రలో నిలిచిపోతదని కుళ్ళు బుద్దితో పూర్తికాకుండా అటు జిహెచ్ఎంసి, ఇటు నేటి అదికార బిఆర్ఎస్ ప్రభుత్వం, పురపాలక శాఖామంత్రి కేటీఆర్  సహయ నిరాకరణతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హబ్సిగూడ కార్పోరేటర్ బిజెపి ఫ్లోర్ సెక్రటరీ కక్కిరేణి చేతన హరీష్, రామంతాపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు, అసెంబ్లీ కన్వీనర్ దేవసాని బాలచందర్,గోరిగే క్రిష్ణ,హబ్సిగూడ ప్రధాన కార్యదర్శులు చెల్లోజు ఎల్లాచారి, చింతకింది ప్రవీణ్, సీనియర్ నాయకులు న్యాలకొండ సుమన్ రావు జిల్లెల రవీందర్ రెడ్డి వేములకొండ వెంకన్న, జిల్లా శ్రీనివాస్ ,వెంకటయ్య, పుచ్చల అశోక్, మహిళా మోర్చ అధ్యక్షురాలు రాగి లతా వెంకట్ రెడ్డి, సాదినేని గీత ,ఉప్పల్ నియోజకవర్గ బిజెపి సీనియర్ నాయకులు, రాష్ట్ర,జిల్లా,డివిజన్ నాయకులు పాల్గొన్నారు.