ముక్కోటి ఏకాదశి సందర్భంగా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉత్తరద్వారం

Published: Tuesday January 03, 2023
పూజలు మధిర జనవరి 2 ప్రజా పాలన ప్రతినిధి ఎరుపాలెం మండలం జమలాపురం పుణ్యక్షేత్రం నందు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో  దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేయడం జరిగినది. అనంతరం ఉదయం 5 గంటల నుండి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కార్యక్రమం నిర్వహించడ మైనది. ఈరోజు సుమారు 10 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు.  ఈ కార్యక్రమాన్ని దేవస్థాన  సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాస్, ఉప ప్రధానార్చకులు ఉప్పల విజయ్ దేవ శర్మ, అర్చకులు ఉప్పల రాజీవ్ శర్మ, మరియు వేద పండితులు ఘనంగా నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ఫౌండర్ ట్రస్ట్ ఉప్పల కృష్ణమోహన్ శర్మగారు,ప్రత్యేక దాత తుళ్లూరు కోటేశ్వర్ రావు నిర్మల కుటుంబ సభ్యులు,  సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమారి,ఎర్రుపాలెం ఎస్సై ఎం. సురేష్ పిఎసిసి చైర్మన్ మూల్పూరి శ్రీనివాస రావు దేవస్థాన ఆర్చిగేట్ నిర్మాణదాత వేజెండ్ల సాయికుమార్, జమలాపురం గ్రామస్తులు మరియు భక్తులు పాల్గొన్నారు.
 ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న భక్తులకు శ్రీ ఆకునూరి రాంబాబు జయసుధ దంపతులు వట్టి గుడిపాడు గ్రామస్తులు తూర్పు ద్వారం వద్ద పులిహోర ప్రసాదము, రవ్వ కేసరి ప్రసాదము పంచడం జరిగినది. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా  పోలీసు సిబ్బందితో ఎర్రుపాలెం ఎస్సై యం.సురేష్ బందోబస్తు నిర్వహించడం జరిగినది.
అధిక సంఖ్యలో వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం సూపరింటెండెంట్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయడం జరిగినది.