ముదిగొండ పోలీస్ స్టేషన్ బైక్ మాయం పోలీస్ స్టేషన్ కే రక్షణ లేకపోతే..?

Published: Tuesday May 25, 2021
ఖమ్మం, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మంజిల్లా ముదిగొండ పోలీస్ స్టేషన్ సీజ్ చేసిన పల్సర్ బైక్ మాయమైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ఇటీవల శాసన మండలి ఎన్నికల సమయంలో తనిఖీలు నిర్వహిస్తున్న టాస్క్ఫోర్స్ అధికారులు మండల పరిధిలోని గోకినేపల్లి సమీపంలో అనుమానం రావడంతో వాహనాన్ని సీజ్ చేసి ముదిగొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ తర్వాత హైదరాబాద్కు చెందిన బైక్ యజమాని రిలీజ్ ఆర్డర్ తీసుకుని స్టేషన్కు రాగా బైక్ లేకపోవడంతో అవాక్క యాడు. అనంతరం మూడుసార్లు తిరిగినా పోలీసులు పట్టించుకోకపోవడంతో సదరు వ్యక్తి సంబం ధిత విషయాన్ని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటిఆర్, పోలీస్ ఉన్నతాధికారులకు ట్విట్టర్లో ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన ఖమ్మం పోలీస్ కమీషనర్ సంఘటనపై సమగ్ర వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని ఖమ్మం రూరల్ ఏసిపి సామా వెంకటరెడ్డిని ఆదేశించారు. దీంతో వారం రోజుల వ్యవధిలోనే ఏసిపి వెంకటరెడ్డి మూడుసార్లు ముది గొండ పోలీస్ స్టేషన్కు వచ్చి దర్యాప్తు చేశారు. ఆయనతో పాటు ఖమ్మం రూరల్ సిఐ సత్యనారాయణరెడ్డి పలుమార్లు ముదిగొండ పోలీస్ స్టేషన్కు వచ్చి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలో బైక్ మాయమైన సంఘటనపై నిజాలు వెలుగులోకి రావడం కోసం స్టేషన్లో ఉన్న అధికారులు, సిబ్బంది ఫోన్ నెంబర్లను ట్యాపింగ్లో పెట్టినట్లు సమాచారం. ఇదిలా ఉండగా ముదిగొండ పోలీస్ స్టేషన్లో ఇరువురు ఎస్ఐలు ఉండడంతో ఇరువురు రెండు వర్గాలుగా విడిపోయారు. గంధసిరి, పెద్దమండవ గ్రామాల్లో ఇసుక అక్రమంగా తరలిస్తున్న విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు గ్రామాల్లో అధికార, ప్రతిపక్ష నేతలకు ఇరువురు ఎస్ఐలు తమకు అనుకూలంగా ఉన్న వారికి అండదండలతో పాటు నెలవారి మామూళ్లు వసూలు చేసుకుంటున్నారు. కొనసాగుతున్న దర్యాప్తు. ట్రాక్టర్ స్పెర్పర్ట్స్ మాయం జెన్స్ నిఘాలో కూడా తేలడంతో ఇటీవల ఏఎస్ఐను హెడ్ క్వార్టర్స్కు అటాచ్ చేశారు. ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్లో పెట్టుకుంటే రిలీజ్ సమయానికి స్పెర్ పార్ట్స్ మాయమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి ముదిగొండ పోలీస్ స్టేష న్లో జరుగుతున్న అక్రమాలపై క్షేత్రస్థాయిలో విచా రణ జరిపించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇదిలా ఉండగా ముదిగొండ పోలీస్ స్టేషన్లో ఇరు వురు ఎస్ఐలు రెండు వర్గాలుగా విడిపోవడంతో వారి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇసుక ట్రాక్టర్లు అక్రమార్కుల వద్ద నెలవారి మామూళ్ల విష యంలో సిబ్బంది మధ్య పోటీ పెరిగి వర్గాలుగా విడి పోయారనే ఆరోపణలు సర్వత్రా విన్పిస్తున్నాయి. సీజ్ చేసిన ట్రాక్టర్లు స్టేషన్లోనే టైర్లు కాలిపోవడం, స్పెర్ పార్ట్స్ మాయమవ్వడం పలుమార్లు చోటు చేసుకు న్నాయి. ట్రాక్టర్ యజమానులు ఈ విషయంలో పోలీ సులతో ఘర్షణలు పడుతున్న సంఘటనలు కోకొల్లలు పోలీస్ వ్యవస్థ ఉన్నది ప్రజల సంక్షేమం కోసం కాకుండా ఇసుక మాఫియా ఆగడాల కోసమే ఉన్నట్లుగా ముదిగొండ ప్రజానీకం భావిస్తున్నారు