అంబేద్కర్ చౌక్ వద్ద ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి, రిలే నిరాహార దీక్ష ** మాదిగ ఉపకులాలకు న్యాయం చేయాల

Published: Thursday July 28, 2022
ఆసిఫాబాద్ జిల్లా జూలై27(ప్రజాపాలన, ప్రతినిధి) : జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద మంద కృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి, నాయకులు బుధవారం మొదటిరోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇంచార్జ్ రేగుంట కేశవ్ రావ్ మాట్లాడుతూ  బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి 8 సంవత్సరాలు గడుస్తున్నా వర్గీకరణ పై నిర్లక్ష్యం వహించడం మాదిగ జాతిని మోసం చేయడమే అవుతుందన్నారు. ఈనెల 3వ తేదీన హైదరాబాదులో జరిగిన బీజేపీ జాతీయ సదస్సులో ఎస్సీల వర్గీకరణపై శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఎమ్మార్పీఎస్, కార్యకర్తలపై ఆర్ఎస్ఎస్, బిజెపి, గుండాలు దాడి చేసి గాయపరచి నందుకు వెంటనే క్షమాపణ చెప్పాలన్నారు. అలాగే ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీల వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించి, మాదిగలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మందకృష్ణ పిలుపుమేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో రిలే దీక్షలు కొనసాగించాలని, ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయాలని, నిరసన కార్యక్రమాలు చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బేడ బుడగ జంగాల రాష్ట్ర కార్యదర్శి అంజన్న, ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జ్ మురళి కృష్ణ, ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ రేగుంట మహేష్, ఎంఎస్పి జిల్లా కో కన్వీనర్ ఇప్ప నాగరాజు, ప్రభాకర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు.