*పంట కోత ప్రయోగం ద్వారా దిగుబడిని అంచనా వేయవచ్చు* -జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ గీతారెడ్డి*

Published: Saturday December 24, 2022
చేవెళ్ల డిసెంబర్
23,(ప్రజాపాలన):-

పంట కోత ప్రయోగం వలన రైతులకు దిగుబడితోపాటు ఎరువుల వినియోగం ఖర్చులు తెలుసుకునే అవకాశం ఉంటుందని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ గీతారెడ్డి అన్నారు.
శుక్రవారం చేవెళ్ల గ్రామ పరిధిలో జిల్లా వ్యవసాయ అధికారి గీతారెడ్డి కందికోత ప్రయోగాన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ..... పంట కోత  ప్రయోగం ద్వారా వచ్చిన ఉత్పత్తిని బట్టి ఎగుమతి మరియు దిగుమతి విధానాన్ని నిర్ణయిస్తారన్నారు. పంట కోత ప్రయోగం చేవెళ్ల గ్రామ పరిధిలో పండ్ల మల్లారెడ్డి మరియు శ్రీనివాస్ రెడ్డి పొలంలో నిర్వహించడం జరిగింది. తదనంతరం దేవుని ఎర్రవల్లి క్లస్టర్ పరిధిలోని రైతు వేదిక యందు రైతులకు సరైన మోతాదులో పురుగుల మందుల వినియోగంపై అవగాహన కల్పించారు. అదేవిధంగా చేవెళ్ల మండలంలో పిఎం కిసాన్ ఈ కేవైసీ ఇంకా 3518 మంది చేసుకోలేదని కావున తదుపరి విడత 2000/ రూపాయల కొరకు తప్పనిసరిగా ఈ కేవైసీ చేసుకోవాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏడిఏ రమాదేవి ఏవో తులసి ఏఈఓ రమేష్ మరియు వరుణ్ రైతులు పాల్గొన్నారు.