టూవీలర్ మెకానిక్ వార్షికోత్సవంలో ముఖ్య అతిథిగా ఏఎస్ఐ బాలస్వామి

Published: Monday April 10, 2023
  బోనకల్, ఏప్రిల్ 9 ప్రజా పాలన ప్రతినిధి: మండలం లో వీలర్ మెకానిక్స్ ప్రధమ వార్షికోత్సవo ఆదివారం బోనకలలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా స్థానిక పోలీస్ స్టేషన్ నుండి ఏఎస్ఐ బాలస్వామి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన టూవీలర్స్ మెకానిక్స్ వచ్చారు. జిల్లా టూ వీలర్స్ మెకానిక్ జిల్లా అధ్యక్షులు కొండలరావు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న మెకానిక్స్ యూనియన్ ఆపదలో ఉన్న మెకానిక్స్ కుటుంబానికి వారికి అండగా ఆడపిల్లల పెళ్ళికి యూనియన్ తరపున 30 వేల రూపాయలు సాయం చేయడం జరుగుతుందన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు ఆలీ పాషా,మధిర మండల అధ్యక్షులు సాంబిరెడ్డి ,బోనకల్ మండల అధ్యక్షులు గోగుల రామారావు, తల్లాడ మండల అధ్యక్షులు నరసింహారావు, సత్తుపల్లి మండల అధ్యక్షులు గువ్వల కృష్ణారెడ్డి ,కొనిజర్ల మండల అధ్యక్షులు పందేళ్ళ కృష్ణ, వైరా మండల అధ్యక్షులు కౌసర్ ఈ కార్యక్రమంలో మండల టూ వీలర్స్ మెకానిక్స్ పాల్గొన్నారు.