ఘనంగా రాజు ముదిరాజ్ జన్మదిన వేడుకలు

Published: Friday April 16, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్ మక్తా కు చెందిన టీఆరెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండె రాజు ముదిరాజ్ జన్మదిన వేడుకలు గురువారం రోజు ఆయన స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానుల మధ్య ఘనంగా నిర్వహించారు. రాజకీయాల్లో క్రేయాశీలక నేత గా ఎదిగి ప్రజలకు మరింత సేవ చేయాలని, ముందు ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన మిత్రులు ఆకాంక్షించారు. కేక్ కట్ చేసి శాలువాలతో సన్మానిoచి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు గుండె గణేష్ ముదిరాజ్, జాజిరావు శ్రీను, గంగారం మల్లేష్, రెపన్ వెంకటేష్, చంద్రమాసి రెడ్డి, సోనుకుమార్ యాదవ్, గోపి తదితరులు పాల్గొన్నారు.