ఎరువులు మందులు విక్రేతలకు శిక్షణ

Published: Wednesday August 18, 2021
జిల్లా కలెక్టర్ పౌసుమి బసు
వికారాబాద్ బ్యూరో 17 ఆగస్ట్ ప్రజాపాలన : రైతులు తమ వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడే వాటి గురించి ఎరువులు మందులు విక్రేతల (డీలర్లు) సలహాలు తీసుకుంటాని జిల్లా కలెక్టర్ పౌసుమి బసు అన్నారు. రైతులకు నాణ్యమైన సూచనలు సలహాలు ఇచ్చేందుకు డీలర్లకు శిక్షణ కార్యక్రమం ఉంటుందని తెలిపారు. మంగళవారం స్థానిక స్త్రీ శక్తి భవన్ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన  వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మేనేజ్ అనే సంస్థ ద్వారా ఎక్సటెన్షన్ సర్వీసెస్ ను బలోపేతం చేయుటకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. వ్యవసాయ శాఖ ద్వారా డీలర్లకు డిప్లొమా కోర్స్ అందించి డీలర్లను సుశిక్షితులుగా తీర్చిదిద్దుతామని వివరించారు. డీలర్లతో పాటు వ్యవసాయ అధికారులు, సైంటిస్ట్ లు, వ్యవసాయ శాఖలు కలిసి సమిష్టిగా రైతులకు సూచనలు, సలహాలు అందించడానికి వీలు పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి గోపాల్, శాస్త్ర వేత్తలు వ్యవసాయ రంగంలో మార్కెటింగ్ కొరకు ఉన్న చట్టాలు, నిబంధనలతో పాటు పండ్ల తోటల రక్షణ, పురుగు మందుల వాడకం, నాణ్యమైన పంట దిగుబడి మెలకువలు డీలర్లకు తెలియజేసినారు. అనంతరం డీలర్లకు ఉపయోగపడే విధంగా ముద్రించిన నోట్స్ ను కలెక్టర్ అందజేసినారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని అన్ని మండలాల డీలర్లు పాల్గొన్నారు.