వైద్య కళాశాల ను బెల్లంపల్లి లో ఏర్పాటు చేయడంలో అధికార పార్టీ నాయకులు విఫలం : మాజీ ఎమ్మెల్యే అ

Published: Thursday September 23, 2021
బెల్లంపల్లి, సెప్టెంబర్ 22, ప్రజా పాలన ప్రతినిధి : అభివృద్ధి చెందిన ప్రాంతాలనే అభివృద్ధి చేస్తూ అభివృద్ధికి దూరంగా ఉన్న వాటిని విస్మరించడం ఈ పాలకులకు అలవాటుగా మారిందని అభివృద్ధికి సహకరించని నాయకులకు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే అమ్రాజుల శ్రీదేవి అన్నారు. బుధవారం నాడు ఆమె తన నివాసంలో  మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలో బెల్లంపల్లి కి ఓ ప్రాముఖ్యత ఉందని అలాంటి ప్రాముఖ్యత గల పట్టణాన్ని అధికార పార్టీ నాయకులు జిల్లా ఏర్పాటులో కానీ మెడికల్ కళాశాల ఏర్పాటులో కానీ విస్మరించడం వారి చేతకాని తనానికి నిదర్శనం అన్నారు. జిల్లా అవుతుందని ఆశపడిన వారికి నిరాశే ఎదురైందని కనీసం జిల్లాకు మంజూరైన మెడికల్ కళాశాలనైనా ఏర్పాటు చేస్తారని ఆశ ఉండేదని అది కూడా మంచిర్యాలలో ఏర్పాటు చేస్తున్నారని తెలియడంతో బెల్లంపల్లి ప్రజల ఆశలు అడియాశలు అయ్యాయని ఆమే అన్నారు. వెనుకబడి అభివృద్ధికి నోచుకోని బెల్లంపల్లి పట్టణాన్ని ప్రజల ఓట్లతో ఎన్నికై ప్రజా ప్రతినిధుల మని చెప్పుకొనే ప్రజాప్రతినిధులకు గాని ఈ మాత్రం అవసరం లేనట్లుగా వుందని లేకుంటే జిల్లాకు వచ్చిన వైద్య కళాశాలను అన్ని రకాలుగా అనుకూలమైన బెల్లంపల్లిలో కాకుండా ఇప్పటికే అభివృద్ధిచెంది లెక్కకు మించిన ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు గల మంచిర్యాలలో ఏర్పాటు చేయడానికి రంగం సిద్దం అయినట్లు తెలుస్తోందని ఇది చాలా విచారకరమని కనీసం మెడికల్ కాలేజి ఏర్పటుతో నైనా కొంత అభివృద్ధి చెందుతుందని ఆశపడ్డ ప్రజలకు ఈ ప్రభుత్వం మొండి చేయి చూపించిందని ఆమే ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధిష్టానానికి వాస్తవాలను వివరించి ఒప్పించి మెప్పించే ప్రయత్నం చేయాలని కూతవేటు దూరంలోనే గోదావరిఖనిలో మరో మెడికల్ కళాశాల ఏర్పాటు కాబోతోందని రామగుండం నుండి మంచిర్యాల 20 కిలోమీటర్లు మాత్రమే ఉందని ప్రక్కనే 30 కిలోమీటర్ల దూరంలో మరో రెండు వైద్య కళాశాలలు ఉన్నాయని ప్రభుత్వానికి చితశుద్ది వుంటే వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధి చెందడాని కావలసిన ప్రణాళిక రూపొందించి బెల్లంపల్లిలో వైద్య కళాశాల ఏర్పాటు చేసినట్లయితే చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలో వైద్యం అందుబాటులోకి వచ్చి బడుగు బలహీనర్గాల, హరిజన, గిరిజన, ప్రాంతాలైన మహారాష్ట్ర బార్డర్ వరకు ఇటు తిర్యాని, ఆసిఫాబాద్, సిర్పూర్, బెజ్జుర్, కౌతాల, ప్రాంతాలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు, పేరుకే హరిజన, గిరిజన, ఉద్దరణ అంటూ చెబుతూ ఆచరణలో మాత్రం ఈ అగ్రవర్ణాల ప్రభుత్వాలు మా వెనుకబడిన ప్రాంతాలకు చేసింది, చేస్తున్నది, ఇక చేసేది, ఏమీ లేదని ఇప్పటికైనా ప్రజలు గ్రహించి ఈ పాలకులకు రాబోయే ఎన్నికల్లో తగిన శాస్తి చేయాలని ఆమె అన్నారు.