ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 16ప్రజాపాలన ప్రతినిధి

Published: Saturday September 17, 2022

తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులే*
      *కాడిగళ్ల భాస్కర్ సిపిఎం జిల్లా కార్యదర్శి*

వీర తెలంగాణ విప్లవ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా సిపిఎం పార్టీ రంగారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా సాగుతున్న బైక్ ర్యాలీ యాత్ర శుక్రవారం తుర్కయంజాల్ మున్సిపల్ కేంద్రానికి చేరుకున్న సందర్భంగా స్థానిక సిపిఎం నాయకత్వం ఘనమైన స్వాగతం తెలియజేసింది
     అనంతరం తుర్కయంజాల్ చౌరస్తాలో  సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు డి కిషన్ అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి కాడిగాళ్ళ భాస్కర్ మాట్లాడుతూ వీర తెలంగాణ విప్లవ రైతాంగ సాయుధ పోరాట వీరనారి చిట్యాల ఐలమ్మ గారి 37వ వర్ధంతిని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో సెప్టెంబర్ 10న ప్రారంభమైన బైక్ ర్యాలీ నేడు ఈ ప్రాంతానికి చేరుకుందని ఈ కాలంలో జిల్లా వ్యాప్తంగా అనేక మండలాలు గ్రామాలు మున్సిపల్ పట్టణ కేంద్రాలు  తిరుగుతూ వీరోచిత తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని ప్రజలకు వివరిస్తూ దానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టుల చరిత్రను త్యాగాలను కొనియాడుతూ నేడు తురకయంజాల్ మున్సిపాలిటీకి చేరుకుందని అన్నారు
      భూమికోసం భుక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం నిరంకుశ నైజాం సర్కార్ కు వ్యతిరేకంగా కులాలకు మతాలకు అతీతంగా ఆనాడు కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలందరూ పోరాటం చేశారని ఆ వీరోచిత పోరాటంలో 4000 మంది అమరులు అయ్యారని వారి త్యాగాల ఫలితంగా సుమారు పది లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచి ఇచ్చిన చరిత్ర కమ్యూనిస్టులు అన్నారు అంతేకాదు 3,000 గ్రామాల్లో గ్రామ స్వరాజ్యాలను ఏర్పాటు చేసుకొని ప్రజలకు సుపరిపాలన అందించిన చరిత్ర కమ్యూనిస్టులు అన్నారు, అలాంటి త్యాగాలను పోరాటాలను నేడు బిజెపి నాయకులూ వక్రీకరిస్తూ ఆ పోరాటాన్ని నీరుగార్చడం హిందూ ముస్లిం గొడవగా చిత్రీకరించి చెప్పడం సిగ్గుమాలిన చర్య అని అన్నారు. చారిత్రాత్మకంగా సాగిన వీర తెలంగాణ విప్లవ రైతాంగ పోరాటానికి అసలు సిసలైన వారసులు కమ్యూనిస్టులేనని ఆ పోరాట స్ఫూర్తితో రాబోయే రోజుల్లో ప్రజా సమస్యల మీద భూ సమస్యల మీద ఉద్యమిస్తామని అన్నారు అదే సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో బిజెపి పాచికలను పారనీయమని అన్నారు.
      ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పగడాల యాదయ్య, బోడ సామెల్ డి. జగదీష్, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఏర్పుల నరసింహ, కందుకూరి జగన్ ఆలంపల్లి నరసింహ ఎన్ మల్లేష్, గోరింకల నరసింహ, ప్రకాష్ కారత్, వినోద్, టి. నరసింహ ఐ. భాస్కర్, కే శంకర్ వెంకటకృష్ణ మాల్యాద్రి శ్రీధర్ యాదగిరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు