చెత్త బుట్టలు పంపిణీ చేసిన సర్పంచ్. శివాజీ

Published: Thursday September 23, 2021
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 22, ప్రజాపాలన ప్రతినిధి : ఎర్రుపాలెం మండలం పెద్ద గోపవరం గ్రామం నందు సర్పంచ్ ఇనప నూరి శివాజీ ఆధ్వర్యంలో తడి చెత్త పొడి చెత్త బుట్టలను గ్రామంలో పంచడం జరిగింది. సర్పంచ్ శివాజి మాట్లాడుతూ చెత్తాచెదారం లను బయట వేయకుండా ఇచ్చినటువంటి బుట్టలో వేయగలిగేనని మనవి. అలాగే ఎటువంటి రోగాలు రాకుండా ఉంటాయని ఆయన పేర్కొన్నారు. గ్రామంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి, సెక్రెటరీ మహేష్, మరియు గ్రామ పంచాయతీ పాలకవర్గం  పాల్గొన్నారు