జాతీయ కవిసమ్మేళనంకు వలిగొండ కవులు ఎంపిక

Published: Saturday May 08, 2021
వలిగొండ, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో తేజ ఆర్ట్స్ క్రియేషన్ సంస్థ 15 వసంతాల వేడుకలను పురస్కరించుకొని జాతీయ కవి సమ్మేళనంను జూమ్ యాప్ ద్వారా ఈ నెల 8, 9 తేదీలలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ వ్యవస్థాపకలు అధ్యక్షులు పోరెడ్డి రంగయ్య రాజేశ్వరమ్మలు తెలిపారు. ఈ జాతీయ కవి సమ్మేళనంకు వలిగొండ పట్టణ కేంద్రంలోని ఆత్మీయ భారతి సాహిత్య సంస్థకు చెందిన కవులు, సంస్థ ప్రధాన కార్యదర్శి రెబ్బ మల్లికార్జున్, కోశాధికారి గంజి దుర్గాప్రసాద్, ఆ జాతీయ కవి సమ్మేళనంకు సమన్వయకర్తగా సంస్థ అధ్యక్షులు వాకిటిరాంరెడ్డి ఎంపికైనట్లుగా తేజ ఆర్ట్స్ క్రియేషన్ సంస్థ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ కవి సమ్మేళనానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ డాక్టర్ నందిని సిధారెడ్డి, కె.వి.రమణచారి ఐ.ఏ.ఎస్, మామిడి హరికృష్ణ, సుద్దాల అశోక్ తేజ, మధురకవి కూరెళ్ల విఠలాచార్యులు, వీరితో పాటు ముంబై, మహారాష్ట్ర, భీమండీ, థాణే, షోలాపూర్ రాష్ట్రాలకు చెందిన తెలుగు కవులు కవిసమ్మేళనంలో పాల్గొంటారని తెలిపారు. కవి సమ్మేళనంకు ఎంపికైన కవులకు ఆత్మీయ భారతి సంస్థ సభ్యులందరు వారికి అభినందనలు తెలియజేశారు.