ప్రస్తుతం ఉన్నా ఆధునీకరణ ప్రపంచానికి దిక్సూచి మేడే

Published: Monday May 02, 2022
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు
బోనకల్, మే 1 ప్రజాపాలన ప్రతినిధి : మండలం లోని కలకోట, బోనకల్, ముష్టికుంట్ల గ్రామాల్లో మేడే సందర్భంగా ఎర్ర జెండా అయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ నాయకులు రామాంజనేయులు మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి మేడే దిక్సూచి అన్నారు. పని గంటల సాధన కొరకు చికాగో లో సాగిన పోరాటం ప్రపంచవ్యాప్తంగా స్ఫూర్తి ని రగిలించింది అన్నారు. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారని, మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినమని, చికాగోలోని కొందరు వీరులు రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగు అందించారన్నారు. ఆ స్ఫూర్తితో భారతదేశంలో అఖిలభారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) 1920వ సంవత్సరంలో ఆవిర్భవించింది అన్నారు. ఏఐటీయూసీ తోనే భారతదేశంలో ఎర్రజెండా ఆవిర్భావం జరిగిందని తెలియజెప్పారు. భారతదేశ కార్మిక ఉద్యమంలో ఏఐటీయూసీ ఒక మైలురాయని,కార్మికుల సంక్షేమం కోసం అనేక పోరాటాలు చేసి ఎన్నో చట్టాలను సాధించిపెట్టిన ఘనత  ఏఐటీయూసీకె ఉందన్నారు. కానీ ప్రస్తుతం మన దేశంలో ఏం జరుగుతుంది. కార్పొరేట్ శక్తులకు అమ్ముడుపోయిన ప్రభుత్వాలు కార్మికుల హక్కుల కాలరాసేందుకు  ప్రయత్నాలు చేస్తుందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను లేకుండా చేసి కార్మికులకు హక్కులను కాలరాసేందుకు నాలుగు లేబర్ కోడ్ లా ఆంతర్యమేంటని, కార్మికుల హక్కులను హరించడం కాదా అని అయన  ప్రశ్నించారు. మోడీ అధికారంలోకి వచ్చాక కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా మార్చివేస్తున్న ఈ తరుణంలో సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు ఒక తాటిపైకి వచ్చి, ఈ పాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని అయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ బోనకల్ మండల కార్యదర్శి యంగల ఆనందరావు, జిల్లా సమితి సభ్యులు తూము రోషన్ కుమార్,  సీనియర్ నాయకులు  జక్కా  నాగభూషణం, యంగల  ఏలేశు, మండల నాయకులు ఆకేనా పవన్, ఏలూరు పూర్ణచంద్రరావు, మాతంగి శ్రీనివాసరావు, బొమ్మినేని కొండలరావు, యంగల కేరి, సాధనపల్లి అమరనాధ్, తదితరులు పాల్గొన్నారు.