విద్య రంగ, పెండింగ్ సమస్యల సాధన కోసం హైద్రాబాద్ ఇందిర పార్క్ ధర్నా ను విజయ వంతం చేయండి.

Published: Thursday July 07, 2022
యూఎస్పీసీ రాష్ట్ర నేత
  మాడుగుల రాములు పులుపు 
 
కరీంనగర్ జూలై 6. ప్రజాపాలన విలేకరి :
"విద్య రంగ పెండింగ్ సమస్యల సాధన కోసం యూఎస్పీసీ
ధ్వర్యంలో  నేడు హైద్రాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నా కు ఉపాధ్యాయులు.. కుటుంబ సభ్యుల తో సహా హాజరై ధర్నా ను విజయవంతం చేయాలని రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు,టీపీటిఎఫ్ రాష్ట్ర
 కార్యదర్శి మాడుగుల రాములు అన్నారు.
  బుధవారం చొప్పదండి మండలంలోని రుక్మాపూరులో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు కరపత్రాన్ని విడుదల చేశారు.
టీపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మాడుగుల రాములు ఈ సందర్బంగా మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణ  రాష్ట్రములో ..
గత ఏడు సంవత్సరాలనుండి పదోన్నతులు లెవని,,నాలుగు సంత్సరకాలంగా, బదిలీలు లేవన్నారు జిల్లా‌వ్యాప్తృగా అనేక మండలాల్లో ఎంఇఓ లు, ప్రధానోపాధ్యాయులు లేరని దీంతో విద్యార్థుల చదువులు ఆటకెక్కె ప్రమాదం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.జిల్లా కేంద్రాల్లో డిప్యూటీ ఎడ్యుకేషన్ఆఆధికారులు,డీఇఓలు, స్కావెంజర్స్ లేరని, అటెండర్స్ లేరు. క్లర్క్ లు లేక‌ విద్యా వ్యవస్థ అతలా కుతలం అయ్యే ప్రమాద  ఉందన్నారు. అనేక ఖాలీలు ఏర్పడిన వాటిని పూరించడం లేదన్నారు. రాష్ట‌వ్యాప్తంగా  హై స్కూల్ హేచ్.ఎమ్ పోస్ట్ లు వెయ్యి 9 వందల 62, కాలీలు, స్కూల్ అసిస్టెంట్ పోస్ట్ లు వేల 1వంద 36, ప్రాథమిక పాశాల హేచ్ .ఎమ్ పోస్ట్ లు 8 వేల1వం 85, ఖాలీలు్నాయని,  మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కేవలము 17 మండలాల లో మాత్రమే రెగ్యులర్ ఎంఇఓ లు పనిచేస్తున్నారని,. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ అసలే లేక మొత్తం ఇంఛార్జి వ్యవస్థ లతో కాలం వెళ్ళబుచ్చుతూ విద్యారంగాన్ని పూర్తిగా సంక్షోభం లోకి నెట్ట బడుతుందన్నారు. సంక్షేమ ప్రభుత్వం మాది అని చెప్పుకునే సంక్షేమ ప్రభుత్వాలకు తగద"న్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి సమస్యలు పర్శరించాలి. ఉద్యమాల కోసం కాచుకుని ఉండడం తగదన్నారు. ఈ సమావేశములో టీపిటీఎఫ్ జిల్లా కార్యదర్శి తిరుపతి,  మండల ప్రధాన కార్యదర్శి నూనె కిరణ్ ఉపాద్యాయ బృందం పాల్గొన్నారు.