కోటమర్పల్లి సర్పంచ్ విజయలక్ష్మిరాచయ్య

Published: Tuesday September 06, 2022

ఉపాధ్యాయుల కృషి మరువలేనిది

వికారాబాద్ బ్యూరో 05 సెప్టెంబర్ ప్రజాపాలన : ఉపాధ్యాయుల కృషి మరువలేనిదని కోటమరపల్లి సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య కొనియాడారు. క్రమశిక్షణతో భావి భారత పౌరులను తీర్చిదిద్దటంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్న ఉపాధ్యాయ బృందానికి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాభివందనాలు తెలిపారు. సోమవారం మర్పల్లి మండల పరిధిలోని కోట మర్పల్లి గ్రామంలో ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలోని ఉపాధ్యాయులను గ్రామ సర్పంచ్ ఘనంగా సన్మానించారు.
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు అశోక్, ఉపాధ్యాయులు సత్యం నాయుడు, శ్రీనివాస్, వీణా, రాధా, కిషోర్, నాగరాజులను మరియు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు సంధ్యా, ఎలిశా, సంగీతలను అంగన్వాడీ టీచర్ అమృతమ్మను గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి రాచయ్య మరియు గ్రామ పెద్దలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ బి.విజయలక్ష్మిరాచయ్య మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదని గుర్తు చేశారు. సమసమాజ నిర్మాణంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొని మనకు మంచి సమాజాన్ని అందించటంలో ఎంతో కృషిచేస్తున్నారని స్పష్టం చేశారు. ముఖ్యంగా మన పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేది గురువులేనని కొనియాడారు. అందుకు మనం వారికి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతో ఉంటుందని అన్నారు. మన వంతు బాధ్యతగా గురువులను పూజించాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు అశోక్ మాట్లాడుతూ గ్రామ సర్పంచ్ విజయలక్ష్మిరాచయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు అని అన్నారు. ఈ గ్రామంలో పని చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉన్నదని ప్రతి సంవత్సరం గురుపూజ దినోత్సవం రోజు మా పాఠశాలకు వచ్చి మమ్మల్ని సన్మానించి మాపై ఇంకా బాధ్యతను పెంచుతున్నారు. దీనికి మాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. గ్రామస్తులకు అందరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ రఘుపతి రెడ్డి, గ్రామ కార్యదర్శి స్వప్న, వార్డ్ మెంబర్లు జైహింద్ రెడ్డి, రాహుల్, పాండు రంగారెడ్డి ఎస్ఎంసి చైర్మెన్, శ్రీశైలం -ఫీల్డ్ అసిస్టెంట్, రాజు టిఆర్ఎస్ గ్రామ ఉపాధ్యక్షుడు,రమేష్ గౌడ్ సొషల్ మీడియా , నర్సింహ,వినోద విఓఎలు,సురేందర్ రెడ్డి కరోబర్ లావణ్య,కిష్టమ్మ, ఆశావర్కర్లు, గంగి ప్రభు, కావలి రాచయ్య, యాదయ్య, నగేష్, తదితరులు పాల్గొన్నారు.