శాలివాహన పవర్ ప్లాంట్ పి.పి.ఏ. పొడిగించాలి* మంచిర్యాల టౌన్, డిసెంబర్ 29, ప్రజాపాలన:

Published: Friday December 30, 2022
శాలివాహన పవర్ ప్లాంట్ పి.పి.ఏ. పొడిగించాలని గురువారం రోజున శాలివాహన  6 మెగావాట్ల బయోమాస్ పవర్ ప్లాంట్  కార్మికులు కార్మిక సంఘము ఆద్వర్యంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయ ఎ ఒ కు   వినతిపత్రం అందజేశారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో శాలివాహన 6 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మించి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి ప్రభుత్వంతో శాలివాహన పవర్ ప్లాంట్ చేసుకున్న పవర్ పర్చేస్ అగ్రిమెంట్ (పి.పి.ఏ) 20 సంవత్సరాల అగ్రిమెంట్ ఈ సంవత్సరం తో పూర్తి  అయినందున తిరిగి ఈ అగ్రిమెంట్ ను కొనసాగించాలని కోరారు. 
కంపెనీలో సుమారుగా 200 మంది కార్మికులకు పైగా  పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు, కంపెనీలో పనిచేస్తున్న కార్మికుల వయస్సులు 45 సంవత్సరాల పైబడిన వాళ్లే ఉన్నారు, కాబట్టి మధ్యంతరంగా కంపెనీ మూసివేస్తే కార్మిక కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొంది, ఈ  సమస్యను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి శాలివాహన పవర్ ప్లాంట్ నకు మరో 10 సంవత్సరాల పాటు పి.పి.ఏ.ను పొడిగించి,పవర్ ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి  కృషి చేసి కార్మికులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘము నాయకులు వరప్రసాద్, కుంటాల శంకర్, కనుకుంట్ల సుధీర్, సగ్గుర్తి ఆనందరావు, సాయిని సమ్మయ్య, కాయితి శ్రీనివాస్, కె.రాజయ్య, పెంట సత్యం,వీరన్న, తదితరులు  పాల్గొన్నారు.