నకిలీ ప్రతి విత్తనాల వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు.

Published: Saturday June 26, 2021

బెల్లంపల్లి, జూన్ 25, ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లా తాండూర్ సర్కిల్ పరిధిలోని మాదారం, నెన్నెల, భీమిని, పోలీస్ స్టేషన్ల పరిధిలో రాష్ట్రంలోకి అనుమతి లేని నకిలీ పత్తి విత్తనాలను అక్రమంగా సరఫరా చేస్తూ అమాయక రైతులకు విక్రయిస్తూ మోసలు చేస్తున్న పలువురు వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేసినట్లు తాండూరు సర్కిల్ స్పెక్టర్ బాబురావు తెలిపారు. శుక్రవారం నాడు ఆయన పత్రికలవారితో మాట్లాడుతూ గత కొంత కాలంగా మంచిర్యాల జిల్లాలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకోనీ నకిలీ ప్రతి విత్తనాలను విక్రయిస్తూ అక్రమ వ్యాపారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని వీరిపై నిఘా వేసి హుజూరాబాద్ మండలం కందుల గ్రామానికి చెందిన పెద్ద మల్ల రాజును మరియు భీమిని మండలం పెద్ద పేట గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ల పై మూడు కేసులు నమోదు చేసి కమిషనర్ ఆదేశానుసారం పి.డి యాక్ట్ నమోదు చేసి ఉత్తర్వులను అందించి చెర్లపల్లి కేంద్ర కారాగారం తరలించినట్లు ఆయన తెలిపారు. నకిలీ విత్తనాలు సరఫరా చేసిన, విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, పీడీ యాక్ట్ అమలుకు కృషి చేసిన బెల్లంపల్లి ఏసీపీ రహేమాన్, తాండూర్ సీఐ బాబు రావు, ఎస్ఐ మానస, కొమురయ్యలను సీపీ అభినందించారనీ ఆయన తెలిపారు.