రిజర్వేషన్లు 56 శాతానికి పెంచాలి

Published: Monday November 28, 2022
రాజ్యసభ సభ్యులు ఉద్యమనేత ఆర్.కృష్ణయ్య
వికారాబాద్ బ్యూరో 27 నవంబర్ ప్రజాపాలన : రిజర్వేషన్లు 56 శాతానికి పెంచాలని రాజ్యసభ సభ్యులు ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని అతిథిగృహంలో జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు రిజర్వేషన్ల స్లాబ్ను ఎత్తివేసిందని స్పష్టం చేశారు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు ఆర్థికంగా సామాజికంగా వైద్య విద్య పరంగా రిజర్వేషన్ల ఆవశ్యకత ఉందని గుర్తు చేశారు బీసీలకు రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు కల్పించడం అత్యంత ఆవశ్యకమని వివరించారు బీసీలు బీసీలకు రాజ్యాధికారం కావాలి కానీ అడుక్కుతినే హక్కు వద్దని అన్నారు 56 శాతం రిజర్వేషన్లు పెంచకపోతే బీసీ సంఘాలు కుల సంఘాలు కేంద్ర ప్రభుత్వంపై ఐకమత్యంతో పోరాటం చేస్తామని హెచ్చరించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బీసీ రిజర్వేషన్ల కంటే ఎక్కువగా రిజర్వేషన్లు పెంచారని వెల్లడించారు రెండు లక్షల కోట్ల బడ్జెట్ బీసీలకు కేటాయించాలని అన్నారు ప్రైవేట్ రంగంలో ఎస్సీ, ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంఘం ప్రధాన కార్యదర్శి బి ఆర్ కృష్ణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ లాల్ కృష్ణ బీసీ ఫ్రంట్ చైర్మన్ మల్లేష్ యాదవ్ బీసీ సేన కన్వీనర్ బర్క కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.