జిల్లా అటవీశాఖ అధికారిగా నీరజ్ కుమార్ టిబ్రేవాల్

Published: Monday March 13, 2023
ఆసిఫాబాద్ జిల్లా మార్చి12 (ప్రజాపాలన,ప్రతినిధి) : 
ఆసిఫాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారిగా నీరజ్ కుమార్ టిబ్రేవాల్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎల్లందు ఎఫ్డివోగా పని చేస్తూ బదిలీపై కొమరం భీం జిల్లా డీఎఫ్ఒగా ఫిబ్రవరి 10న బదిలీ అయినప్పటికీ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అటవీ శాఖ అధికారిని జిల్లాలోని ఎఫ్డిఓ ఎఫ్ఆర్వో లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో అటవీ సంరక్షణ కోసం కృషి చేయాలని సూచించారు. అనంతరం జిల్లా అధికారికి వారు పుష్పగుచ్ఛం అందించారు. ఇప్పటివరకు ఇక్కడ డీఎఫ్ఓ గా మంచిర్యాల అటవీశాఖ అధికారి అదనపు బాధ్యతలు నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఈకార్యక్రమంలో కాగజ్ నగర్ ఎఫ్డివో విజయ్ కుమార్, జిల్లాలోని వివిధ రేంజ్ ఆఫీసర్ లు అప్పలకొండ, మజారుద్దీన్, దయాకర్, పూర్ణచందర్, రాంబాబు, సంతోష్, వేణుగోపాల్, సిబ్బంది పాల్గొన్నారు.