సీజనల్ వ్యాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ...మండల వైద్యాధికారి ప్రసాద్

Published: Monday July 04, 2022
జన్నారం రూరల్, జూలై 03, ప్రజాపాలన: 
 
 వర్షాకాలంలో వ్యాప్తి చెందే సీజనల్ వ్యాధుల నియంత్రణ, అత్యవసర వైద్యసేవలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని మండల వైద్యాధికారి  ప్రసాద్ అన్నారు. ఆదివారం పొన్కల్ గ్రామంలో ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు గోళీలు అందజేశారు. అదేవిధంగా వానకాలంలో వ్యాప్తి చెందే డెంగ్యూ , మలేరియా , డయోరియా , తదితర వ్యాదుల వ్యాప్తిని అరికట్టే అంశంపై అవగాహన కల్పించారు. 
 ఈ సందర్భంగా వైద్యాధికారి
మాట్లాడుతూ సిజనల్ వ్యాదులు ఎక్కువగా తాగునీటి ద్వారా నే వచ్చే అవకాశం ఉందని,  వర్షాకాలం కావడంతో త్రాగు నీరు కలుషితమవుతుంది కాబట్టి , చేతిపంపు , బావి నీటిని సేవించినపుడు నీటిని మరిగించి చల్లారిన తర్వాత తాగాలని పేర్కొన్నారు. ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిలువకుండా చూసుకోవాలని అన్నారు. నీటి గుంటల వల్ల వ్యాది కారకాలైన  దోమలు ,ఈగలు వ్యాప్తి చెందుతారని తెలిపారు. వీటితో మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాదులు వ్యాప్తి చెందుతాయని తెలిపారు.
ఈ కార్యాక్రమంలో టి పోషయ్య, ఎచ్ఎ, జే దీవెన పిఎచ్ఎన్, జే పోసనీ ఎచ్ఎస్, లావణ్య, అషా, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area