మణుగూరు మండలం లంక మల్లారం ఎస్సి సెల్ బి. ఆర్. ఎస్ పార్టీ గ్రామ కమిటీ సభ్యులతో విస్తృస్తాయి సమ

Published: Friday November 25, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ర్ పార్టీ అధ్యక్షులు ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు గౌ:శ్రీ రేగా కాంతారావు  ఆదేశాల మేరకు.
మణుగూరు మండలం బి. ఆర్. ఎస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు గంగారపు రమేష్ గారి అధ్యక్షతన
ముఖ్య అతిధిలు పినపాక నియోజకవర్గం బి. ఆర్. స్ పార్టీ ఎస్సి సెల్  అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్  ఆధ్వర్యంలో లంక మల్లారం ఎస్సి సెల్ గ్రామ కమిటీ సభ్యులతో సమావేశం అయ్యి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి చర్చిచటం జరిగింది.
అదేవిధంగా పినపాక నియోజకవర్గం బి. ఆర్. ఎస్ పార్టీ ఎస్సి సెల్ అధ్యక్షులు వెన్న అశోక్ కుమార్  ఈ సందర్బంగా మాట్లాడుతూ.తెలంగాణ ప్రభుత్వం దళితుల అభ్యున్నతికై ఎన్నో సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నది అనీ అన్నారు,తెలంగాణ ప్రభుత్వం అంకిత భావంతో దళిత బందు పధకం ప్రవేశ పెట్టి 10 లక్షలు రూపాయలు ఇచ్చి దళితులు ఆర్ధికంగా వెనకబడకుండా ఉండాలనికీ దోహదం చేసింది అనీ అన్నారు.దళితబందు పథకం మీద వస్తున్న వార్తలు ఎవ్వరు నమ్మవద్దు అనీ, ఈ పథకం 7సంవత్సరాల ప్రోగ్రామ్ అనీ, అర్హులైన దళిత కుటుంబాలు అందరికి ఈ పధకం అందుతుంది అన్నారు.పినపాక నియోజకవర్గం శాసనసభ్యులు గౌ:శ్రీ రేగా కాంతారావు గారు నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనుల గురించి మీ గ్రామంలో ప్రజలకు తెలియజేసే భాద్యత కమిటీ వారిదే అనీ అన్నారుఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గం బి. ఆర్. ఎస్ పార్టీ పరిశీలుకులు తడికమల్ల ప్రభుదాస్, మణుగూరు మండలం ఎస్సి సెల్ ప్రధానకార్యదర్శి కట్ట రాజకుమార్,సీనియర్ నాయకులు మేకల రవి, వేముల లక్ష్మణ్, రావులపల్లి వెంకటేశ్వర్లు, చెరుకు సుధ,అశ్వాపురం మండలం బి. ఆర్. ఎస్ పార్టీ ఎస్సి సెల్ ప్రధానకార్యదర్శి వల్లెపోగు రాము,కల్యాణపురం గ్రామశాఖ అధ్యక్షులు వెన్న సంగీతరావు, బాజిబాబా, చంద్రు, మణుగూరు మండలం ఎస్సి సెల్ కమిటీ కార్యవర్గ సభ్యులు, నాయకులు,గ్రామస్తులు,  కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో తదితరులు  పాల్గొన్నారు.