వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

Published: Monday September 26, 2022

క్రీడా నైపుణాలు సాధిస్తే ఉజ్వల భవిష్యత్తువికారాబాద్ బ్యూరో 25 సెప్టెంబర్ ప్రజా పాలన : క్రీడా నైపుణ్యాలు సాధించిన విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ వికారాబాద్ పట్టణంలోని అనంతగిరిపల్లి సమీపంలో గల సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ఆవరణలో నిర్వహించిన జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు.

మొదటగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి, నివాళులర్పించి, జ్యోతిప్రజ్వలన చేసి విద్యార్థులు నిర్వహించిన క్రీడా ప్రదర్శనలను తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ క్రమశిక్షణ, పట్టుదలతో సాధన చేస్తే క్రీడల్లో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం, క్రీడా సదుపాయాలు గురించి వివరిస్తూ విద్యార్థులకు స్ఫూర్తి నింపారు.

ఈ కార్యక్రమంలో లంకా పుష్పలత లక్ష్మీకాంత్ రెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.