ఎప్పుడు ఎన్నికలొచ్చినా బండికి,గంగులకు బుద్దిచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

Published: Wednesday July 13, 2022
ఒకరు యువకులను, ఒకరు నిరుపేదలను మోసం చేస్తున్న, బండి,గంగుల ఇద్దరు మోసగాల్లే
 
బండి, గంగుల పై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి
 
కరీంనగర్‌ జూలై 12. ( ప్రజాపాలన ప్రతినిధి :
కరీంనగర్ ఎంపి  ఉన్నా బండి సంజయ్ కుమార్,రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ లు పరస్పర ఆరోపనలు చేసుకోవడం తప్పా జిల్లా అభివృద్దికి చేసేందేమి లేదని నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి మండిపడ్డారు.ఒకరు దీక్షల పేరుతునూ మరోకరు‌ విమర్శలతో పబ్బం గడుపు కుంటున్నారే తప్పా ప్రజకు ఒరగ బెట్టిందేమి లేదని ఆయన విమర్శించారు.
 మంగళవారం నాడు స్థానిక
స్ భవన్ లో కాంగ్రెస్ శ్రేణులతో సమావేశం నిర్వహించారు.అనంతరం ఆయన  విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తీగలగుట్టపల్లి రైల్వే ప్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేయలేని మీరు,ఎన్నో వాగ్దానాలు ఇచ్చి యువకులను వాడుకొని మోసం చేసిన మీరు కరీంనగర్ ప్రజలకు చేసిందేమీలేదన్నారు, ఎప్పుడు ఎన్నికలొచ్చినా బండి సంజయ్ కు, గంగుల కమలాకర్ కు బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని నరేందర్ రెడ్డి హితవు పలికారు, మంత్రి గంగుల కమలాకర్ ఒక్క నిరుపేదకు డబుల్ బెడ్రూం ఇవ్వలేని, మూడెకరాల భూమి ఇవ్వలేని అసమర్థ నాయకుడని ఎత్తి చూపారు. రోప్ వే బ్రిడ్జిచుట్టూ, రివర్ ఫ్రంట్ చుట్టూ భూములు కొనుగోలుచేసిన తరువాత పనులు మొదలు పెట్టీ రాజకీయాన్ని వ్యాపారం చేసుకునే ఘనుడు గంగుల కమలాకర్ అని ఆయన ఎద్దేవా చేశారు. బండి సంజయ్ గంగుల కమలాకర్ కాలం చెల్లిన మందు లాంటి వారని ఎప్పుడు ఎన్నికలొచ్ఛినా రాజకీయ సమాధి చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారని అన్నారు, దళిత బంధు పేరుతో మోసాలకు తెరలేపారనీ,నిరుపేద దళితులకు ఆశ చూపి పైసలు వసూలు చేసి ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నారన్నారు.దళిత బందు పథకం మంజూరులో దళారులంతా మంత్రి అనుచరులేనని ఆరోపించార . ఎప్పుడూ ఎన్నికలు వచ్చినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్దంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు., ఈ సమావేశంలో నాయకులు సమద్ నవాబ్, శ్రావణ్ నాయక్, గుండాటీ శ్రీనివాస్ రెడ్డి, లింగంపెళ్లి బాబు, సయ్యద్ అఖిల్, సలేమొద్దిన్, కొరివి అరుణ్ కుమార్, ఎం డి చాంద్, జీ డి రమేష్, దన్న సింగ్, దండి రవీందర్, ఎజ్రా, పొరండ్లా రమేష్, షబానా మహమ్మద్, ముక్క భాస్కర్, శేహెంశా, ఎం డి నదీo, మామిడి సత్యనారాయణ రెడ్డి, వంగల విద్యాసాగర్, నాగుల సతీష్, భూపతి రావు, కంకణాల అనిల్ కుమార్, హనీఫ్, ఎస్ డి అజ్మత్, అమీర్, కుంబాల రాజ్ కుమార్, మంద రవీందర్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.