వైద్యాధికారుల కొరకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ ...జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా॥ సుబ్బారాయుడు

Published: Saturday July 23, 2022

మంచిర్యాల బ్యూరో, జులై 22, 2022 :

 

జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ పరిధిలో సి.ఈ.ఎం.ఓ.ఎన్.సి. సెంటర్, చెన్నూర్ ఓ.బి.జి. స్పెషలిస్ట్ - 1, పలైటివ్ కేర్ (మంచిర్యాల) - 1 వైద్యాధికారి ఎం.బి.బి.ఎన్. కొరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 26వ తేదీన ఉదయం 11 గం॥ లకు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ ఆవరణలోని సమావేశ మందిరంలో వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా॥ సుబ్బారాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు వారి నిజ ధృవీకరణ పత్రాలను పరిశీలన నిమిత్తం, ఒక జత నకలు తీసుకొని నకాలంలో హాజరు కావాలని తెలిపారు.