విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షం

Published: Tuesday May 18, 2021

పరిగి, 17 మే ప్రజాపాలన ప్రతినిధి : విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్షం మరియు సరైన పర్యవేక్షణ లోపం కారణంగా ప్రమాదాల పరంపరా కొనసాగుతూనే ఉన్నది.. గత ఏడాది కాలంగా మండల పరిధిలో చాలా ప్రమాదాల జరిగాయి. కొన్ని ప్రమాదాలలో మనుషులు ప్రాణాలు కోల్పోగా.. మరికొన్నిచోట్ల మూగ జీవాల భలికావడము జరిగింది.. ఇంత జరుగుతున్న అధికారులలో మాత్రం ప్రమాదము జరిగినా రోజున చిన్నపాటి అడవుడి చేయడం తరువాత.. పట్టనట్టు వ్యవహరించడం అలవాటుగా మారిపోయింది. అధికారులు బిల్లులు వసూలు చేయడం మాత్రమే వారి విధులుగా భావించడం దురదృష్టకరం. ప్రమాదాల తీరును విశ్లేషించి సమీక్షించుకుని తగు చర్యలు చేపట్టి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుంటే.. చాలా వరకు ప్రమాదాలను నివారించుకోవచ్చు విద్యుత్ శాఖ మండల స్థాయి అధికారుల వద్ద మండలములో గల విద్యుత్ లైన్ ల పై పూర్తి అవగాహన లేకపోవడం. విద్యుత్ లైన్ ల నిర్వహణ, పర్యవేక్షణ లోపాలు, ప్రజల నుంచి వచ్చిన పిర్యాదు లను పట్టించుకోకపోవడం పరిపాటి గా మారిపోయింది. విద్యుత్ శాఖ చెప్పేట్టే నూతన లైన్ల నిర్మాణం లో గానీ పాత లైన్ల ఆధునీకరణ లో గానీ సాంకేతిక సూచనలను పాటించకపోవడం, నాణ్యత ప్రమాణాలను కాంట్రాక్టర్ లతో కుమ్మకై ఇష్టానుసారం వ్యవహరించడం. అవకాశం వచ్చినకాడ లైన్ల షిఫ్ట్ఇంగ్ వంటి పనులు అంచనా కట్టకుండా అధికారిక అనుమతులు పొందకుండా.. రికార్డ్ లో చూపకుండా చేసి దండుకోడం వంటివి ఎన్నో జరిగినట్టు అనుమానం వస్తుoది 4 సంవత్సరాలుగా పాత విద్యుత్ లైన్ల ఆధునీకరణకు కేంద్రప్రభుత్వ పథకం ద్వారా నిధులు వచ్చినాయి. పనులు జరిగినా తీరు పై అనుమానాలు కలిగి ....సమాచార హక్కు చట్టం క్రింద పూర్తి వివరాలు అడిగి 15 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం శాఖ పనితీరుకు నిలువుట్టీ అద్దము. గ్రామాలలో అంతర్గత లైన్ల వేసిన తీరు కొన్ని చోట్ల చాలా ప్రమాదకరంగా ఉన్నది. వినియోగదారుల మౌఖికంగా పిర్యాదు చేసిన నిమ్మకు నీరత్తినట్టు ఉండడము జనల ప్రణలమీదకు వస్తుంది.బిల్లులు వసూళ్ల సమయములో తప్ప మిగతా టైంలో సిబ్బంది అందుబాటులో ఉండకపోవడం, మండల స్థాయి అధికారులు ఫోన్ లో కూడా అందుబాటులోకి రాకపోవడం సమస్యలు జటిలం కావడానికి కారణాలుగా మారుతున్నాయి. అన్ని కాగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాలి విజయ కుమార్ రెడ్డి అన్నారు. అధికారుల తీరు మారకపోతే బాధితుల భాగస్వామ్యంతో నిరసన కార్యక్రమాలు చెప్పట్టల్సి వస్తుంది అని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  మాలి  విజయ కుమార్ రెడ్డి అన్నారు.