భగీరథ కార్మికుల 3 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని ధర్నా ** సిఐటియు జిల్లా అధ్యక్షుడు లోకేష్ **

Published: Tuesday December 06, 2022

ఆసిఫాబాద్ జిల్లా డిసెంబర్ 5 (ప్రజాపాలన,ప్రతినిధి,సురేష్ చారి) : మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుల 3 నెలల పెండింగ్ వేతనాలు ఇవ్వాలని మిషన్ భగీరథ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు అల్లూరి లోకేష్ మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్,జిల్లా వ్యాప్తంగా ఉన్న మిషన్ భగీరథ కాంటాక్ట్ కార్మికుల 3 నెలల పెండింగ్ వేతనాలు, ప్రయాణ చార్జీలు, బండి పెట్రోల్ బిల్లు5 వేలు చెల్లించి, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్మికులతో శ్రమ చేయించి వేతనాలు పెండింగ్లో పెట్టడం సరి కాదని, పెండింగ్లో ఉన్న వేతనాలు సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులతో కలిసి సమస్యల పరిష్కరించే వరకు  పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. రేపు కలెక్టరేట్ కార్యాలయం యచ్చట  కార్మికుల సమస్యలపై నిర్వహించే కార్మికులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నా కార్యక్రమంలో భగీరథ కాంట్రాక్టర్ కార్మిక సంఘం జిల్లా మాజీ అధ్యక్షుడు ప్రణయ్, వాకిలి మండలం నుండి సురేష్, హరీష్, పరమేష్, గౌతమ్ బాలేష్ తదితరులు పాల్గొన్నారు.