ఉప్పల్ డిఎస్ఎల్ మాల్లో వైట్ అండ్ వైట్ షూటింగ్ శట్టింగ్ షాప్ను ప్రారంభించిన కార్పొరేటర్ యుగ

Published: Monday October 25, 2021

మేడిపల్లి, అక్టోబర్ 24 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్-రామంతాపూర్ ప్రధాన రహదారిలో ఉన్న డిఎస్ఎల్ మాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వైట్ అండ్ వైట్ షూటింగ్ శట్టింగ్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 11వ డివిజన్ కార్పొరేటర్ మద్ది యుగేంధర్ రెడ్డి పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యమైన వస్త్రాలను విక్రయించాలని షాప్ యజమానులకు సూచించారు. ఈ కార్యక్రమంలో షాప్ యజమానులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.