ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో కాస్తు చేసుకొనివ్వడం లేదు. ....దళిత రైతు ఆందోళన

Published: Wednesday September 21, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 20 ప్రజా పాలన ప్రతినిధి: 
 
గత ప్రభుత్వం ఇచ్చిన భూమిలో పంటలు పండించుకుందామని కాస్తు చేసుకోవడానికి పోతే అటవీశాఖ అధికారులు చేసుకొనివ్వడం లేదని దళిత రైతు ఆందోళన వ్యక్తం చేశారు.
 మంచిర్యాల జిల్లా 
బెల్లంపల్లి నియోజకవర్గం లోని వెన్నెల మండలానికి చెందిన చిప్పకుర్తి రాజం అనే దళిత రైతు మంగళవారం స్థానిక బాబు క్యాంపు ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  మాట్లాడారు, గతతెలుగుదేశం ప్రభుత్వం నెన్నెల మండల పరిధిలో నాలుగు ఎకరాల భూమిని ఇవ్వగా, ఐదు సంవత్సరాల పాటు వివిధ రకాల పంటలు పండించి గిట్టుబాటులేక బ్రతుకు దెరువు కోసం ఖమ్మం జిల్లాలోని మహబూబాబాద్, డోర్నకల్, ప్రాంతానికి వలస పోయి, ఇటీవల తన భూమిని సాగు చేసుకోవడానికి వచ్చి సాగు చేస్తుంటే ఆటవిశాఖ అధికారులు వెళ్ళగొడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
తనకు ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన పాసుపుస్తకాలు మరియు రైతుబందు కింద వచ్చే డబ్బులను కూడా తీసుకుంటున్నానని, ఇవన్నీ చూపించిన అటవీశాఖ అధికారులు సస్సేమిరా అంటూ భూమిలోకి రావద్దని గెంటి వేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.
ఏది ఏమైనా గత ప్రభుత్వాలు ఇచ్చిన భూమిని, ప్రస్తుత ప్రభుత్వం బలవంతంగా లాక్కోవడం ఆక్షేపనీయమని, తన భూమిని తనకే ఇప్పించాలని, అనవసరంగా అడ్డుకుంటున్న అటవీ శాఖ అధికారులపై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని ఆయన జిల్లా కలెక్టర్కు, సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు.