రాజ్యాంగం రద్దు కుట్రలు చేస్తున్న బీజేపీ విధానాలను ప్రతిఘటించిండి.రాజ్యాంగ రక్షణ కోసం ఐక్య

Published: Friday August 05, 2022

ఇబ్రహీంపట్నం ఆగష్టు తేదీ 4 ప్రజాపాలన ప్రతినిధి.కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు రాజ్యాంగం రద్దు కుట్ర చేసిందని రాజ్యాంగ రక్షణకు భారతీయులు ఐక్యం కావాలని దేశాన్ని రక్షించాలని యువతరం సిద్ధం కావాలని కేవిపిస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆలంపల్లి నరసింహ అన్నారు.యాచారం మండల కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రత్యేక సమావేశం నిర్వహించారు

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు ఆలంపల్లి నరసింహ మాట్లాడుతూ... బిజెపి అధికారంలోకి వచ్చిక ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం రద్దుచేసి దళితులకు అడుగడుగునా అన్యాయం చేస్తుందని అన్నారు. కెసిఆర్ పాలనలో దళితులకు వాగ్దానాలు అమలు కాలేదు అన్నారు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి, డబల్ బెడ్ రూమ్ ఇస్తానని హామీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన లక్ష్యాలకు విరుద్ధంగా అధికార పార్టీ కార్యకర్తలకు పళ్లెంలో ఫలహారంగా పంచిపెడుతూ ఎమ్మెల్యేలు అర్హులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కలెక్టర్ల ద్వారా అర్హులైన ప్రజలందరికీ దళిత బంధు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఈ నెల 7 నుంచి 9 వరకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న కెవిపిస్ 3వ రాష్ట్ర మహాసభలకు కేవీపిస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయగలరని ఆయన కోరారు

ఈ సమావేశంలో భాగంగా నూతన యాచారం మండల కమిటీ ని ఎన్నుకోవడం జరిగింది

మండల అధ్యక్షునిగా కావాలి జగన్, కార్యదర్శిగా దంత్తక పెద్దయ్య, ఉపాధ్యక్షునిగా నరసింహ, రమేష్, సహాయ కార్యదర్శి గా కుమార్, శేఖర్, కమిటీ సభ్యులుగా నారాయణ, కృష్ణ, వెంకటేష్, కృష్ణ, గణేష్ ఎన్నుకోవడం జరిగింది .