అసైన్డ్ భూములు పట్టా భూములుగా గుర్తింపు: వెల్గటూర్ తాసిల్దార్ ఎం.రాజేందర్

Published: Wednesday February 24, 2021

వెల్గటూర్, ఫిబ్రవరి 23 (ప్రజాపాలన ప్రతినిధి): వెల్గటూర్ మండలకేంద్రంలో నివసిస్తున్న ఇంటి భూములు గతంలో ప్రభుత్వ భూములు గా సబ్ రిజిస్టార్ కార్యాలయంలో నమోదు గా ఉన్నవి. గ్రామస్తుల అభ్యర్థన మేరకు ఇట్టి భూములను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రజలతో మరియు ఉన్నతాధికారులతో గతంలో వెల్గటూర్ మండల కేంద్రంలో ప్రత్యేక  సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ భూములు గా ఉన్న రికార్డులను సరిచేసి పట్టా భూములు గా గుర్తించినట్లు మండల తహసీల్దార్ ఏం. రాజేంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. ఇక నుండీ ఎవరైనా మండల కేంద్రంలోని ఇంటి, చుట్టు పక్కల భూములు కోనేవారు వెల్గటూర్ సబ్ రిజిస్టార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకోగల సౌకర్యం ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని ఈ అవకాశాన్ని అందరూ నియోగించు కోవాలని తెలియ చేశారు.