మంజూరైన పలు చెక్కులను, ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్లను అందజేసిన ఎమ్మెల్యే డా. సంజయ్, జడ్పీ చైర్ప

Published: Wednesday September 21, 2022

జగిత్యాల, సెప్టెంబర్ 20 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల రూరల్ మండల కన్నాపూర్ గ్రామంలో నూతనంగా మంజూరైన 46 ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్లను లబ్ధిదారులకు అందజేసి, ఐదుగురికి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన 1 లక్ష 35 వేల రూపాయల విలువగల చెక్కులను, ఒకరికి కల్యాణలక్ష్మి చెక్కును అందజేసి అనంతరం గ్రామంలో డిఎంఎఫ్టీ నిధులు 4.60 లక్షలతో నిర్మించిన తులసి మహిళ గ్రామ ఐక్య సంఘం భవనాన్ని ప్రారంభించి, సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావా వసంత సురేష్  భూమిపూజ చేసినారు. అంతకుముందు గ్రామానికి వచ్చిన ఎమ్మేల్యే, జెడ్పీ చైర్ పర్సన్ కు తిలకం దిద్ది, డప్పు చప్పుళ్ళు, బతుకమ్మ లతో   గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు ఘన స్వాగతం పలికినారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, పాక్స్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి, మండల రైతు బందు సమితి కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు బాల ముకుందం, సర్పంచ్ కొక్కు సుధాకర్, ఎంపీటీసీ రెడ్డి రత్న రవి, ఉప సర్పంచ్ లక్ష్మి, ఎంపిడిఓ రాజేశ్వరి, ఎపిఎం గంగాధర్, గ్రామ శాఖ అధ్యక్షులు ప్రభు, నాయకులు మీసవేణు, జితేందర్, మురళి, రవి, గంగారాం, నారాయణ, శేకర్, యూత్ అధ్యక్షుడు మల్లేష్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు, ప్రజలు, తదితరులు, పాల్గొన్నారు.