నంది హిల్స్ చౌరస్తాలో కోవిడ్-19 ఉచిత టెస్టులు

Published: Wednesday May 26, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధి : ఉచిత కరోన టెస్టులకు విశేష స్పందన వచ్చిందని తెరాస డివిజన్ ఇంచార్జ్ రామిడి జ్యోతి నర్సిరెడ్డి పేర్కొన్నారు. మీర్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 9 వ డివిజన్ లో నందిహిల్స్ చౌరస్తాలో హ్యాండ్ ఆఫ్ హోప్ స్వచ్చంద సంస్థ జయరామ్, తెరాస డివిజన్ ఇంచార్జి రామిడి జ్యోతి నర్సిరెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం నాడు ఉచిత కరోన టెస్టు లను కార్పొరేషన్  మేయర్, డిప్యూటీ మేయర్, ప్రజాప్రతినిధుల చే ప్రారంభించారు. ఈ సందర్భంగా స్వచ్ఛంద సంస్థ జయరామ్ మాట్లాడుతూ.... కరోనా మహమ్మారి వైరస్ టెస్టులకు విశేష స్పందన లభించిందిని అన్నారు. ఇక్కడ మొత్తం 252 మందికి పరీక్షలు నిర్వహించగా అందులో 29 మందికి‌ పాజీటివ్ రాగ‌ మిగత వారికి నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందిని చెప్పారు. పాజీటివ్ వచ్చిన వారందరికి కరోన కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమం‌‌‌ ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించబడిందిని, వీటితోపాటు బిపి, షుగర్ పరీక్షలు కుడా ఉచితంగా నిర్వహించారుని అన్నారు. నంది హిల్స్ చౌరస్తాలో ఉచిత కరోనా టెస్టులు పరీక్షలు చేసినందుకు వివిధ కాలనీవాసులు రామిడి జ్యోతి నర్సి రెడ్డి కి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈకార్యక్రమం‌లో  మీర్ పేట మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహాన్, కార్పోరేటర్ అక్కిమాధవి ఈశ్వర్ గౌడ్, తొమ్మిదవ డివిజన్ తెరాస ఇంచార్జి రామిడి జ్యోతి నర్సిరెడ్డి, న్యూ నందిహిల్స్ ఫేజ్ 1 కాలని  అధ్యక్షులు మట్టా సత్యనారాయణ గౌడ్, చల్లా సురేందర్ రెడ్డి,బి ప్రవీణ్ రెడ్డి, హాము నాయక్, వెంకట రమణ చారి, సాయిలు, భాస్కర్ రెడ్డి, తన్నీరు రంగారావు, కిషన్ నాయక్, గోపాల్ యాదవ్, లక్ష్మణ్ గౌడ్, సిద్దు, హరికృష్ణ రెడ్డి, ఎం అరవింద్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, శ్రీశైలం, ప్రకాష్ చారి, మురళీ చారి, ఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.