మొక్కలు నాటి చెత్త సేకరణ ట్రాలీ లను ప్రారంభించిన ఎంపీ వెంకటేష్ నేత

Published: Monday July 12, 2021

బెల్లంపల్లి, జూలై 11, ప్రజాపాలన ప్రతినిధి : మూడో విడత పట్టణ ప్రగతి లో భాగంగా ఆదివారం నాడు బెల్లం పెల్లి మున్సిపాలిటీ పరిధిలోనీ మున్సిపల్ చెత్తను సేకరించే వాహనాలను ప్రారంభించి మొక్కలు నాటిన పెద్ద పెళ్లి పార్లమెంట్ సభ్యులు బోర్లకుంట వెంకటేష్ నేత. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరు అలవాటుగా మార్చుకోవాలి అని మొక్కలు నాటడం కాదు వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా మనదేనని అన్నారు. చెట్లు మానవాళికి మనకు తెలియకుండానే ఎంతో ఉపయోగపడతాయని వాటిని కాపాడుకోవడం మా బాధ్యతని అన్నారు.  అనంతరం మున్సిపల్ కార్యా లయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మున్సిపల్ చెత్తను చేరవేసే నూతన ట్రాలీలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు వెంకటేష్ నేత, ఎమ్మెల్సీ పురాణం సతీష్, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా శ్రీధర్, కమిషనర్ పంజాల రజిత మున్సిపల్ కౌన్సిలర్లు, తెరాస నాయకులు తదితరులు పాల్గొన్నారు.