మణుగూరులో అధ్వానంగా తయారైన సెల్ వన్ సేవలను పునరుద్ధరించాలి ఐ ఎఫ్ టి యు నాయకులు నా సర్ పాషా . మ

Published: Friday November 25, 2022
 గత మూడు రోజులుగా మణుగూరు ఏరియాలో పూర్తిగా నిలిచిపోయి అద్వానంగా తయారైన  సెల్ వన్ (బిఎస్ఎన్ఎల్) సేవలను పునరుద్ధరించాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి సెల్ వన్ వినియోగదారుడు sd నా సర్ పాషా సంబంధిత అధికారులను కోరారు, గురువారం సాయంత్రం ఆయన మాట్లాడుతూ మణుగూరు ఏరియాలో సింగరేణి సంస్థతో పాటు ఉద్యోగులు ,హెవీ వాటర్ ప్లాంట్, బి టి పి ఎస్ జాతీయ బ్యాంకులు తదితర సంస్థలు కూడా బిఎస్ఎన్ఎల్ సేవల పైనే ఆధారపడి ఉన్నాయని ఫోన్ సేవలే కాకుండా నెట్  బ్యాంకింగ్ ఇతరత్రా  సేవలు కూడా బిఎస్ఎన్ఎల్ లావాదేవీలు జరుగుతుంటాయని కానీ సెల్ వన్ సేవలను చూస్తే అన్నిచోట్ల టవర్లు ఉంటాయి కానీ అన్నివేళలా సిగ్నల్ ఉండదు అనే సామెతగా తయారైందని ప్రభుత్వ రంగంపై మమకారం ఉన్నవాళ్లు కూడా  ప్రైవేట్ రంగాన్ని ఆశ్రయించే స్థాయికి సెల్ వన్ సేవలు మారిపోయాయని  ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా బిఎస్ఎన్ఎల్ అధికారులు స్పందించి మణుగూరు ఏరియాలో అధ్వానంగా తయారైన సెల్ వన్ సేవలను వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా పునరుద్ధరించాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో ఏరియా అధ్యక్షులు ఏ మంగీలాల్ బిఎస్ఎన్ఎల్ వినియోగదారుడు డి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.